తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా? అవి కాకుండా ఇవి తీసుకుంటే ఎన్నో లాభాలట మీకు తెలుసా? - HEALTHY EMPTY STOMACH DRINKS

-బరువు తగ్గడంతోపాటు రోగ నిరోధక శక్తి మెరుగు -ఇంట్లోనే లభించే వీటిని తాగితే ఎంతో మంచిదట!

HEALTHY EMPTY STOMACH DRINKS
HEALTHY EMPTY STOMACH DRINKS (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Feb 19, 2025, 10:09 AM IST

Empty Stomach Drinks for Weight Loss: మనలో చాలా మంది నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అయితే వీటికి బదులుగా మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాల్ని పరగడుపున తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో తెలుసుకుందాం రండి..

ఉసిరి:ఉసిరిలో విటమిన్‌-సి అధికంగా ఉండడమే కాకుండా.. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయని చెబుతున్నారు. అందుకే ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా? (Getty Images)

తేనె:ముఖ్యంగా పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయని చెబుతున్నారు. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువునూ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. 2020లో Nutrition and Metabolism జర్నల్​లో ప్రచురితమైన "The impact of honey and lemon juice on weight loss in obese individuals: A randomized controlled trial" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తులసి:ఇంకా రోజూ తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని, నీటిని తాగేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిదని తెలిపారు.

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా? (Getty Images)

వెల్లుల్లి:సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయని వెల్లడించారు. ఇంకా రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయని వివరిస్తున్నారు. అందుకే వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగడమే కాకుండా.. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయని పేర్కొన్నారు.

వెల్లుల్లి (Getty Images)
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా? (Getty Images)

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

లంచ్ చేయగానే నిద్ర వస్తుందా? ఇందుకు కారణమేంటి? ఎలా తప్పించుకోవాలి?

ఇలా పడుకుంటే మొటిమలు వస్తాయట మీకు తెలుసా? ఆ తప్పులు మీరు చేస్తున్నారా?

ABOUT THE AUTHOR

...view details