తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

స్టైల్​​ కోసం టైట్ జీన్స్, హ్యాండ్ బ్యాగ్స్​, హీల్స్ వాడుతున్నారా? - ఇది తెలిస్తే వాటి జోలికి అస్సలు వెళ్లరు! - UNHEALTHY FASHION TRENDS

ఫ్యాషన్‌గా కనిపించేందుకు ఈ వస్తువులు వాడుతున్నారా? - జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవంటున్న నిపుణులు!

Fashion Trends Bad for Health
FASHION TRENDS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2025, 1:55 PM IST

Fashion Trends Bad for Healthy Life :పాత ఫ్యాషన్లకు మెరుగులద్ది, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్​లతో పరుగులు తీస్తున్న కాలమిది. ఈ క్రమంలోనే ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది స్టైలిష్​గా, ట్రెండీగా కనిపించడం కోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా మారిన ఫ్యాషన్​ ట్రెండ్స్​ను ఫాలో అవుతుంటారు. అయితే, ఫ్యాషన్ ట్రెండ్స్​తో లుక్ వహ్వా అనిపిస్తోంది సరే! కానీ, అది ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాగు బరువెంత?నేటి రోజుల్లో పార్టీ, ఫంక్షన్​, ఇంకేదైనా పని మీద బయటకు వెళ్లినా చేతిలో బ్యాగ్ ఉండాల్సిందే! అయితే, అలా తీసుకుళ్లే బ్యాగ్​ని అనవసరమైన వస్తువులతో నింపేస్తాం. దాంతో ఆ బరువెక్కిన బ్యాగ్​ని అలా స్టైల్​గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తాం. అంటే అంతటి భారాన్నీ చేతి మీదే పడేస్తున్నాం. ఫలితంగా కీళ్ల దగ్గర ఇన్‌ఫ్లమేషన్, నరాలు ఒత్తుకుపోవడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఇది అంతటితో ఏమీ ఆగదు. కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ చూపుతుంది. మెడ, వెన్నెముకలపైనా తద్వారా మన పోశ్చర్‌పైనా దుష్ప్రభావం పడేలా చేస్తుందంటున్నారు. కాబట్టి, వీలైనంతవరకూ బ్యాగుల్ని తేలిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఒకవైపే వేసుకోవడం చేయొద్దంటున్నారు.

హీల్స్‌ విషయంలో !ఫ్యాషన్ కోసమో, సన్నగా పొడవుగా కనిపించాలనో చాలా మంది మహిళలు హీల్స్​ని ఆశ్రయిస్తుంటారు. అయితే, వీటిని ఎప్పుడో ఒకసారి సందర్భానికి అనుగుణంగా వేసుకుంటే పర్లేదు. అలాకాకుండా డైలీ కొనసాగిస్తే నడుము, మోకాలు, మెడ నొప్పులకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, ముప్పైల్లోకి వచ్చాక, ప్రీమెనోపాజ్, మెనోపాజ్‌ దశల్లో ఎముకలు గుల్లబారడం మొదలవుతుందంటున్నారు. కాబట్టి, వీళ్లు వీలైనంతవరకూ హీల్స్​కి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. నేషనల్ ఇని​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్​లోనూ హై హీల్స్ వేసుకోవడం పాదాల సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, ఇతర కీళ్ల సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగుతు వద్దు!టైట్ దుస్తులను ధరించడం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని దీర్ఘకాలం వేసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అయితే, స్కిన్నీ జీన్స్, లెగ్గింగ్స్‌ వంటివి చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి. కానీ, శరీరానికి అతుక్కునిపోయి నరాలపై ప్రభావం చూపుతాయంటున్నారు. దీంతో రక్తప్రసరణ సరిగా జరగదు. పొట్ట దగ్గర ఒత్తుకుని పోతేకడుపుబ్బరం, అజీర్తిలకు కారణమవుతుందంటున్నారు. అంతేకాదు, జననాంగాల్లో విపరీతమైన చెమటకు కారణమై ఇన్‌ఫెక్షన్లకీ దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వదులుగా, చెమటను పీల్చుకునేలా ఉండే వస్త్రాలనే ఎక్కువగా ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు.

కళ్లు జాగ్రత్త :నేటి అమ్మాయిలు మేకప్‌తోపాటు కళ్ల లుక్‌నీ మార్చేస్తున్నారు. అందుకు వాళ్లకి సాయపడేది కాంటాక్ట్‌ లెన్స్‌లే. అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నా, కళ్లజోడునా ముఖానికి సరిపోదని భావించేవాళ్లూ కాంటాక్ట్‌ లెన్స్‌లను ఎంచుకుంటుంటారు. అయితే, వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు. ముఖ్యంగా వీటిని ఎక్కువసేపు ఉంచుకున్నా, సరిగా శుభ్రం చేయకపోయినా, వాటిని ఉంచుకుని స్నానాలు వగైరా చేసినా కళ్ల ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అలాగే కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడానికి కూడా దారి తీయొచ్చంటున్నారు. కాబట్టి, స్టైల్​గా కనిపిస్తున్నామని మురిసిపోకుండా ఆరోగ్యాన్నీ పట్టించుకోండని సూచిస్తున్నారు.

వీటి విషయంలోనూ :లో దుస్తుల్ని ఎలా ఎంచుకుంటున్నారు? వీటినీ మరీ బిగుతైనవి ఎంచుకోవద్దంటున్నారు నిపుణులు. సింథటిక్, నాన్‌ బ్రీతబుల్‌ రకాలైతే అసలే వాడొద్దని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణం అవుతాయి. ఫలితమే ఇన్‌ఫెక్షన్లు. అదే విధంగా వదులుగా, జారిపోయే బ్రాలనీ వేసుకోవడం కొనసాగించొద్దు. ఇవి అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

సూపర్​ : ఈ బ్యూటీ టిప్స్​ పాటిస్తే - నలభైలో కూడా ఇరవైలా కనిపిస్తారు!

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

ABOUT THE AUTHOR

...view details