తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంట్లో వైర్లు, బోర్డులు బయటకు కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే రూమ్ అందంగా కనిపిస్తుందట! - HOW TO HIDE WIRES IN ROOM

-టీవీ, వైఫై వైర్లు కనిపిస్తూ అందాన్ని చెడగొడుతున్నాయా? -ఈ టిప్స్ పాటిస్తే అందంగా మారుతుందని నిపుణుల సలహా!

How to Hide Wires in Room
How to Hide Wires in Room (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Feb 9, 2025, 3:48 PM IST

How to Hide Wires in Room :ప్రస్తుత ఆధునిక యుగంలో చాలా వస్తువులు వైర్​లెస్​గానే వస్తున్నాయి. కానీ, కొంత మంది ఇళ్లలో టీవీ, వైఫై లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల కేబుల్స్, బాక్సులు బయటకు కనిపిస్తూ గది అందాన్ని చెడగొడుతుంటాయి. ఒకవేళ మీ సొంత ఇళ్లు అయితే, ఇష్టారీతిన మార్పులు చేసుకోవచ్చు. కానీ అద్దె ఇంట్లో ఉంటే ఈ పని అంత ఈజీగా జరగదు. డ్రిల్స్, గోడలకు మేకులు కూడా కొట్టనీయకుండా అడ్డు చెబుతుంటారు ఓనర్స్. దీంతో వైర్లు, కరెంట్ బోర్డులు బయటకు కనిపించినా ఏం చేయలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఈ టిప్స్ పాటిస్తే గోడకు ఎలాంటి డ్రిల్స్ లేకుండానే వీటిని కనిపించకుండా చేయచ్చంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫర్నీచర్ వెనుక: ఫర్నీచర్ వెనుక భాగంలో కేబుల్స్​ కనిపించకుండా పెట్టడం చాలా సులభమైన మార్గం. గమ్​తో కూడిన క్లిప్స్​ను ఉపయోగించి ఫర్నీచర్ కాళ్లు, వెనుక భాగంలో వైర్లను పెట్టి అతికించాలి. ఇలా చేయడం వల్ల గోడను కనీసం టచ్ కూడా చేయకుండానే వైర్లు కనిపించకుండా చేయవచ్చు. ఇంకా ఈ క్లిప్పులను ఏ సమయంలోనైనా సులభంగా తీసి కొత్త ప్రదేశంలోకి కూడా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కేబుల్ మేనేజ్​మెంట్ బాక్సులు: సాధారణంగా టీవీ ఉండే ప్రదేశంలో వైఫైతో పాటు ఇతర రకాల వైర్లు ఉంటాయి. ఇవన్నీ ఒకే చోట ఉండి గందరగోళంగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలాంటి సమస్యకు కేబుల్ మేనేజ్​మెంట్ బాక్సులతో చక్కటి పరిష్కారం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంకా ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బాక్సులు లభిస్తున్నాయని.. వీటిని ఉపయోగించి చాలా అందంగా చేసుకోవచ్చంటున్నారు.

కేబుల్ కవర్స్: కొంతమందికి ఇంట్లో చాలా దూరం పాటు వైర్లను వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వారు ఎలాంటి డ్రిల్ వేయకుండానే వాడే కేబుల్ కవర్సును ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో వైర్లను పెట్టి ఒకసారి రంగు వేస్తే గోడలోనే కలిసిపోతుందని వివరిస్తున్నారు. ఫలితంగా గోడకు ఎలాంటి ఇబ్బంది కలగదని సలహా ఇస్తున్నారు.

వాల్ ప్యానెల్స్: ఇవే కాకుండా ఇంకా మీకు ఓపిక ఉంటే వెయిన్స్​కోటింగ్ పద్ధతితో క్లాసిక్ లుక్ వచ్చేలా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనికి డ్రిల్స్ వేయడం, మేకులు కొట్టడం, గోడను కట్ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. దీనిని గోడకు ఒక ఇంచు బయటకు వచ్చేలా పెట్టుకుని.. వైర్లను అందులో తిప్పాలని సలహా ఇస్తున్నారు.

యాక్సెంట్ ప్యానెల్స్: టీవి, డెస్క్ ఎక్కడైనా సరే వైర్లు కనిపించకుండా ఈ యాక్సెంట్ పాన్యెల్స్ ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. వీటిని వాడడం వల్ల ఎలాంటి గందరగోళం లేకుండా అందంగా కనిపిస్తుందని వివరిస్తున్నారు. వీటిని చెక్క, టైల్స్​తో కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు.

డెకరేషన్: ఇవేవీ కాకుండా చాలా సులభంగా, చౌకగా అయిపోయే మరో మార్గం డెకరేషన్. మీ ఇంట్లోని వైర్లు కళావిహీనంగా కనిపించకుండా దానిపై చక్కగా డెకరేషన్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. కేబుల్స్ కనిపించకుండా పూల మొక్కలు, పుస్తకాలను అందంగా అమర్చుకోవచ్చు. ఎలాంటి డ్రిల్లింగ్ అవసరం లేకుండా వైర్లు కనిపించకుండా ఉండేందుకు ఒక షెల్ఫ్ లాగా ఏర్పాటు చేసి వాటిలో ఏదైనా వస్తువులను అమర్చినా సరిపోతుంది.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాలిన గాయాలు, మొటిమల మచ్చలకు తేనెతో చెక్- బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుందట!

రోజూ బాడీ లోషన్ రాస్తున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

ABOUT THE AUTHOR

...view details