Anti Valentine Week 2025 Full List:మీరు సింగిలా? వారం రోజుల పాటు ప్రేమికుల హడావుడి, సంతోషాన్ని చూసి చికాకు పడుతున్నారా? ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఫిబ్రవరిలో లవర్స్‌తో పాటు సింగిల్స్, లవ్ బ్రేకప్ అయినవారి కోసం కూడా ఓ వారం ఉంది. వాలెంటైన్స్ వీక్ వ్యతిరేకంగా యాంటీ వాలెంటైన్స్ వీక్ కూడా నిర్వహిస్తుంటారు. దీనిని ప్రేమికుల రోజు ముగిసిన మరుసటి రోజు నుంచే జరుపుకొంటారు. ఈ వారాన్ని సింగిల్‌గా ఉన్నవారితో పాటు అప్పుడే రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన వారు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకత ఉంది? దాని వెనుక ఉన్న ప్రాముఖ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్లాప్ డే (ఫిబ్రవరి 15): మీకు ఎక్స్ లవర్ ఉందా? రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాక.. వారికో గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారా? అయితే, ఈ రోజు మీ కోసమే! మీ జ్ఞాపకాలను చెరిపివేసి దానికి గుర్తుగా భాగస్వామిని సున్నితంగా చెంప దెబ్బ కొట్టాలని చెబుతున్నారు. అలానీ, హింసకు దారి తీయకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
కిక్ డే (ఫిబ్రవరి 16): యాంటీ వాలెంటైన్ వీక్‌లో రెండో రోజు కిక్ డే. ఈరోజు మీ లవర్ జ్ఞాపకాలన్నింటినీ ఒక కిక్ ఇచ్చి వదిలించుకోవాలట. మీ భాగస్వామి ఇచ్చిన కానుకలను దూరం పెట్టడమే కిక్ డే ప్రత్యేకత.
పర్ఫ్యూమ్ డే (ఫిబ్రవరి 17): యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు పర్ఫ్యూమ్ డే. బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చి మీపై మీరు దృష్టి సారించడం, మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోవడమే దీని ఉద్దేశం. ఈ రోజున చాలా రోజులుగా కొనాలనుకుంటున్న మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ కొట్టుకుని కొత్త పరిమళాలను అనుభవించాలని చెబుతున్నారు.
ఫ్లర్ట్ డే (ఫిబ్రవరి 18): సింగిల్‌గా ఉండి బోర్ కొట్టిందా? ఒకసారి మళ్లీ మీ ఎక్స్ లవర్‌తో మాట్లాడాలని ఉందా? అయితే, ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు మీదే! ఇప్పటివరకు వారు అనుభవించిన భయాలను వదిలి ఎక్స్‌తో ఫ్లర్ట్ చేస్తారని అంటున్నారు.