Total Solar Eclipse 2024 :ఆకాశం, అంతరిక్షంలో జరిగే వింతలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన ఖగోళ దృష్యాలను వీక్షించే అవకాశం వస్తుంటుంది. ఇటీవల మార్చి 25న చంద్రగ్రహణం ఏర్పడింది. ఏప్రిల్ 8న ఆకాశంలో సంపూర్ణ సూర్యగ్రహణం చూసే అవకాశం రానుంది. ఈ సందర్భాన్ని ఖగోళ అద్భుతంగా పేర్కొంటున్నారు. భూమికి చంద్రుని సామీప్యత, సౌర విస్ఫోటనాలు కారణంగా ఎక్కువ సమయం సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు(When Is Next Solar Eclipse).
భారత్లో కనిపిస్తుందా?
April 8, 2024 Eclipse Time :2024 ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. అయితే ఈ అద్భుత దృశ్యాలను భారతదేశం నుంచి వీక్షించే అవకాశం లేదు. మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, యునైటెడ్ స్టేట్స్ గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని కొన్ని లక్షల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి.
గ్రహణం వ్యవధి!
April 8, 2024 Eclipse Path :గ్రహణం గరిష్ఠ వ్యవధి 4 నిమిషాల 28 సెకన్లు. 2017లో ఏర్పడిన గ్రహణం కంటే రెట్టింపు సమయం ఏప్రిల్ 8 నాటి సూర్యగ్రహణం కనిపించనుంది. ఈ గ్రహణం కనిపించే 115 మైళ్ల వెడల్పుగల కారిడార్‌లో సుమారు 44 మిలియన్ల మంది నివసిస్తున్నారు. మజాట్లాన్, మెక్సికో నుంచి న్యూఫౌండ్ ల్యాండ్ వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీనిని చూసే అవకాశం లభించనుంది.
సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏంటి?
What Is Total Solar Eclipse :సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుగా ఉంటాడు. దీన్నే సూర్యగ్రహణంగా చెబుతారు. చంద్రుని నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఈ మార్గాన్ని సంపూర్ట మార్గం(పాత్ ఆఫ్ టోటలిటీ) అని అంటారు. ఈ సమయంలో ఆకాశం చీకటిగా ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది. వాతావరణం బాగుంటే సంపూర్ణ మార్గంలో ఉన్న వ్యక్తులు ఆకాశంలో అద్భుతమైన ఖగోళ దృశ్యాలను చూడవచ్చు. కరోనాగా పేర్కొనే సూర్యుని బాహ్య వాతావరణం కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో సూర్యుడి కాంతి వల్ల ఈ భాగం కనిపించదు.
సూర్యగ్రహణం అరుదుగా ఎందుకు ఏర్పడుతుంది?
Why Are Solar Eclipses Rare :సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదు. ఎందుకంటే వాటిని చూడటానికి అనువైన ప్రదేశాలు భూమి మీద తక్కువ. భూమిలో ఎక్కువ భాగం దాదాపు మూడు వంతులు మహా సముద్రాలతో నిండి ఉంది. మిగిలిన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాలను వీక్షించే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి గ్రహణాలు సాధారణంగా సుదూర, నిశ్శబ్ద ప్రదేశాలలో ఏర్పడతాయి. దీంతో వాటిని చూసే అవకాశం మనకు ఉండదు.
నాసా ప్రయోగం!
NASA Sounding Rockets :నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA) ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మూడు సౌండింగ్ రాకెట్‌లను ప్రయోగిస్తుంది. గ్రహంలోని కొంత భాగంపై సూర్యరశ్మి కొంత సమయం మసకబారినప్పుడు భూమి ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేస్తుంది. అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకారం సౌండింగ్ రాకెట్లను మూడు వేర్వేరు సమయాల్లో ప్రయోగిస్తారు. ఆ ప్రాంతంలో గ్రహణం ఏర్పడటానికి 45 నిమిషాల ముందు, గ్రహణం సమయంలో, గ్రహణం పూర్తయిన 45 నిమిషాల తర్వాత ప్రయోగించనుంది. గ్రహణం సూర్యుడి అయానోస్పియర్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై డేటాను సేకరించడం, కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగించే అవాంతరాలను అర్థం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు ఉపయోగపడనున్నాయి.
అంధులూ సూర్యగ్రహణం చూసేలా
Light Sound Device :సాధారణంగా సూర్యగ్రహణం లాంటివి సంభవించినప్పుడు ప్రజలు వివిధ రకాల కళ్లద్దాలు లేదా ఇతర పరికరాలను ధరించి ఆకాశం వైపు చూస్తూ ఆనందిస్తారు. అయితే, అటువంటి అవకాశం లేని అంధుల కోసం అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వాటర్‌టౌన్ నగరంలోని పెర్కిన్స్ అంధుల పాఠశాల ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. 'లైట్‌సౌండ్' (Light Sound Device Eclipse) పేరుతో రూపొందించిన దీనిని అసిస్టివ్ టెక్నాలజీ మేనేజర్ మిన్ హా పరీక్షించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా, తద్వారా ఆ ఖగోళ దృశ్యాన్ని వారు ఆస్వాదించేలా చేస్తుంది.
అంధుల కోసం తయారు చేసిన 'లైట్‌సౌండ్' డివైజ్! 'లైట్‌సౌండ్' పరికరాన్ని పరీక్షిస్తున్న పాఠశాల సిబ్బంది! ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW
ఒకేసారి 456 మంది నామినేషన్- 4పేజీల్లో బ్యాలెట్ పేపర్- దేశం దృష్టిని ఆకర్షించిన ఎన్నిక - 456 CANDIDATES IN BELAGAVI LS Polls