నస్రల్లా వారసుడే మెయిన్ టార్గెట్! లెబనాన్‌పై దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ - Israel Lebanon War
Published : Oct 4, 2024, 8:47 AM IST
|Updated : Oct 4, 2024, 9:12 AM IST
Israel Lebanon War Live Updates : లెబనాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, తమ ఆయుధ స్టోరేజీ స్థలాలు, అబ్జర్వేషన్ పోస్టులు టార్గెట్‌గా హెజ్‌బొల్లా ప్రయోగించిన 200 రాకెట్లను కూల్చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు, ఇరాన్ చేసిన క్షిపణి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే విషయమై ఇజ్రాయెల్-అమెరికా చర్చలు జరుపుతున్నాయి.
LIVE FEED
బీరుట్ ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు
మరోవైపు, బీరుట్‌లోని రఫిక్ హరిరి ఎయిర్‌పోర్టు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయి నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. అయితే, ఈ పేలుళ్లలో ఎలాంటి నష్టం సంభవించిందన్నది ఇంకా తెలియరాలేదు.
నస్రల్లా వారసుడే మెయిన్ టార్గెట్‌గా బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి!
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ మరో భారీ వైమానిక దాడి చేపట్టినట్లు సమాచారం. హెజ్‌బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం ఇంతవరకు స్పందించలేదు. హషీమ్ ఓ అండర్‌గ్రౌండ్ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెలీ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో హషీమ్ గాయపడ్డాడా?అతడి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. కాగా, హషీమ్ ప్రస్తుతం హెజ్‌బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్‌గా ఉన్నాడు. హసన్ నస్రల్లాకు హషీమ్ దగ్గరి బంధువు. 2017లో అతడిని అమెరికా టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.