తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు రష్యా మద్దతు- భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్​!

భారత్‌, బ్రెజిల్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్న రష్యా

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

UNSC India
UNSC India (ANI)

UNSC India Permanent Membership : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి-UNSCలో శాశ్వత సభ్యత్వం పొందే విషయంలో భారత్‌కు రష్యా మరోసారి మద్దతుగా నిలిచింది. భారత్‌, బ్రెజిల్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా మరోసారి స్పష్టం చేసింది.

మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండడం ఎంతో అవసరం!
"భారత్‌, బ్రెజిల్‌తోపాటు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం" అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. స్థానిక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్నారు.

శాశ్వత సభ్యత్వానికి అర్హమైన దేశం భారత్‌!
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్‌ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సమకాలీన భౌగోళిక రాజకీయ పరిణామాలను ఐరాసలో ప్రతిబింబించడం లేదని ఉద్ఘాటిస్తోంది. ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వానికి అర్హమైన దేశమని భారత్‌ చేస్తున్న వాదనతో అగ్రదేశాలు కూడా ఏకీభవిస్తున్నాయి. లో భారత్‌ ప్రాతినిధ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతుండగా.. కేవలం చైనా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఇప్పటికే భారత్‌కు మద్దతుగా నిలవగా బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, చైనాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details