తెలంగాణ

telangana

ETV Bharat / international

జాబిల్లిపై దిగిన తొలి అమెరికా ప్రైవేట్ ల్యాండర్‌- కానీ సిగ్నల్స్ మాత్రం వీక్! - america moon mission 2024

Private Lander On Moon : అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ చంద్రమండల యాత్రను విజయవంతంగా చేపట్టింది. తాము పంపిన ల్యాండర్ చంద్రడి ఉపరితలంపై దిగిందని ఆ సంస్థ ప్రకటించింది.

Private Lander On Moon
Private Lander On Moon

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 9:47 AM IST

Updated : Feb 23, 2024, 12:52 PM IST

Private Lander On Moon : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఆ సంస్థ ప్రయోగించిన ప్రైవేటు ల్యాండర్‌ ఒడిస్సస్‌ గురువారం చంద్రుడిపై అడుగుపెట్టింది. గతవారమే ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ఈ ల్యాండర్‌తో కూడిన రాకెట్‌ను ప్రయోగించింది. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన చంద్ర మండల యాత్ర ఇదే కావడం గమనార్హం.

'బలహీనంగా సంకేతాలు'
అయితే ల్యాండర్‌ నుంచి వచ్చే సంకేతాలు బలహీనంగా ఉన్నాయని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సంస్థ తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిందని మాత్రం ధ్రువీకరణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ల్యాండర్​ పరిస్థితి ఏంటి? ఏ ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యిందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. చంద్రుడిపై దిగినట్లు ప్రకటించిన వెంటనే లైవ్‌ వెబ్‌క్యాస్ట్‌ను నిలిపివేసింది. ల్యాండర్‌ నుంచి వస్తున్న బలహీన సిగ్నల్స్‌ను ఎలా మెరుగుపర్చాలో విశ్లేషిస్తున్నామని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ టిమ్‌ క్రెయిన్‌ వెల్లడించారు.

50 ఏళ్ల తర్వాత!
దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగంతో అమెరికా చంద్రమండల యాత్ర చేపట్టినట్లయింది. మరోవైపు చంద్రుడి ఉపరితలంపైకి చేరిన తొలి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ నిలిచింది. గత నెలలో ఆస్ట్రోబోటిక్‌ ఆ దిశగా అడుగులు వేసినా విఫలమయ్యాయి. రోదసి యాత్రలను వాణిజ్యీకరించడంలో భాగంగా ఒడిస్సస్‌ ప్రయోగం కోసం ఇంట్యూటివ్‌కు నాసా 118 మిలియన్‌ డాలర్ల నిధులను అందించింది.

వారం రోజుల పాటు పనిచేసేలా!
దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు ల్యాండర్‌ ఒడిస్సస్‌ను దింపాలని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మాలాపెర్ట్‌- ఏ అనే బిలానికి సమీపంలో అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని ల్యాండ్​ అయ్యేలా ప్రోగ్రామింగ్​ చేశారు అధికారులు. వారం పాటు పనిచేసేలా దీన్ని రూపొందించారు.

చంద్రయాన్​-4కు ఇస్రో రెడీ!
గతేడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో త్వరలోనే చంద్రయాన్‌-4 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. లుపెక్స్‌ పేరుతో చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చే ప్రాజెక్టు వైపు ఇస్రో అడుగులు వేస్తోందని స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ ఇటీవలే తెలిపారు. ఆయన ఇంకేం చెప్పారో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ.. రెండు పేలోడ్లు సిద్ధం

'ఆశలు లేవు.. చంద్రయాన్‌-3 ఇక ముగిసినట్లే!'

Last Updated : Feb 23, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details