తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​తో మోదీ ఫోన్ టాక్​- ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ? - MODI SPEAKS TO US PRESIDENT TRUMP

రెండోసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్​ ట్రంప్​నకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు- ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం పనిచేస్తామని 'ఎక్స్'​ వేదికగా వెల్లడి

MODI TRUMP
MODI TRUMP (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 8:13 PM IST

Updated : Jan 27, 2025, 9:06 PM IST

Modi Speaks To US President Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి ఫోన్‌ సంభాషణ ఇదే కావడం గమనార్హం.

"నా ప్రియమైన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్​తో మాట్లాడడం ఆనందంగా ఉంది. చారిత్రాత్మక విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్​నకు నా అభినందనలు. పరస్పర ప్రయోజనకరమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పనిచేస్తాం."
- ప్రధాని మోదీ ట్వీట్​

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ?
ట్రంప్‌- మోదీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

భారతీయులపై ఎఫెక్ట్​!
ఇదిలా ఉండగా అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని గంటల్లోని డొనాల్డ్ ట్రంప్ కీలక పత్రాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. "అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదు" అని ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు జన్మించే సంతానంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురుచూడటం అనేది కీలకమైనదే. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే వీసా ఆలస్యాల వల్ల వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలూ దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Jan 27, 2025, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details