తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ దూకుడుకు బ్రేక్​- నిక్కీ హేలీకి తొలి ప్రైమరీ విజయం - us primary elections

Nikki Haley First Primary Win : రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్‌నకు బ్రేక్‌ పడింది. ట్రంప్​పై ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా ప్రైమరీలో విజయం సాధించారు.

Nikki Haley First Primary Win
Nikki Haley First Primary Win

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 11:02 AM IST

Updated : Mar 4, 2024, 1:42 PM IST

Nikki Haley First Primary Win : అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు తొలి విజయం సాధించారు. ఆదివారం డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా(DC)లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌ పడినట్లైంది. అయితే, ఆయన్ను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న పలు ప్రైమరీల్లో కూడా నిక్కీ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

అయితే ఇటీవల జరిగిన తన సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ నిక్కీ ఓడిపోయారు. అయినప్పటికీ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. అయితే డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ నమోదిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్‌ తమ పార్టీ ప్రైమరీలో 92 శాతం ఓట్లు సాధించారు.

మొదటి మహిళ నిక్కీ
రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందిన తొలి మహిళగా నిక్కీ హేలీ చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్, రిపబ్లికన్ రెండు పార్టీల్లో ప్రైమరీలలో గెలిచిన మొదటి భారతీయ- అమెరికన్ కూడా నిక్కీ రికార్డు నమోదు చేశారు. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలా హారిస్, 2024లో వివేక్ రామస్వామి ఈ ముగ్గురు ఒక్క ప్రైమరీ కూడా గెలవలేకపోయారు.

మరోవైపు ట్రంప్‌ శనివారం మిసోరి, మిషిగన్‌, ఐడహో ప్రైమరీల్లోనూ నిక్కీపై ఘన విజయం సాధించారు. ట్రంప్ నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. మంగళవారం 15 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరుగునున్నాయి. ట్రంప్​ దూకుడు చూస్తుంటే అభ్యర్థిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు డమొక్రటిక్ పార్టీలో జో బైడెన్ ముందజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, ట్రంప్ మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

'బైడెన్ వద్దు- ఒబామా భార్య అయితే ఓకే'- డెమొక్రాట్ల అభ్యర్థిగా మిషెల్​కు జై!

ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్​కు గట్టి పోటీ- ఆమెపై పైచేయి సాధించేనా?

Last Updated : Mar 4, 2024, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details