Mozambique Boat Accident :ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో ప్రమాదవశాత్తూ పడవ మునగడం వల్ల సుమారు 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారాలు తెలిపారు.
ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారిక సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడం వల్ల ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదవ్వగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి.
పడవ బోల్తా- 14మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి-!
Gujarat Boat Capsized News : ఈ ఏడాది జనవరిలో గుజరాత్ వడోదరాలోని హర్ణి మోట్‌నాథ్ సరస్సులో జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు, వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Boat Accident In Nigeria : ఇదే సంవత్సరం నైజీరియాలోని నార్త్-సెంట్రల్ నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 100 మంది వరకు ప్రయాణికులు గల్లంతయ్యారు. నైజర్ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవలో పరిమితికి మించి వ్యక్తులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన మంగళవారం నార్త్-సెంట్రల్ నైజీరియాలో జరిగింది. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
న్యూయార్క్‌లో భూకంపం- గాజాపై చర్చిస్తుండగా 'ఐరాస'లో ప్రకంపనలు - New York Earthquake Today
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి 6నెలలు- 33వేలు దాటిన మరణాలు- గాజాలో ఘోర పరిస్థితులు! - Israel Hamas War Latest