తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓవెన్​లో చిన్నారిని పడుకోబెట్టిన తల్లి- కాలిన గాయాలతో మృతి- కారణం తెలుసుకుని పోలీసులు షాక్ - mother killed baby in oven

Mother Put Baby In Oven : ఓ పసికందును పొరపాటుగా ఊయలకు బదులుగా ఓవెన్​లో పడుకోబెట్టింది తల్లి. దీంతో ఆ చిన్నారి తీవ్ర కాలిన గాయాలతో అక్కడిక్కడే మరణించింది. ఈ హృదయ విదారక ఘటన అమెరికా మిస్సౌరిలోని కనాస్​ నగరంలో జరిగింది.

Mother Put Baby In Oven
Mother Put Baby In Oven

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 10:58 AM IST

Updated : Feb 11, 2024, 11:36 AM IST

Mother Put Baby In Oven :కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కానీ ఈమే మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన చిన్నారిని తన నిర్లక్ష్యంతో పొట్టన పెట్టుకుంది. తాను చేసిన చిన్న పొరపాటుకు ఓ అభంశుభం తెలియని పసికందు ప్రాణం పోయింది. పసికందును ఊయలకు బదులుగా పొరపాటున ఓవెన్​లో పడుకోబెట్టింది. దీంతో తీవ్ర కాలిన గాయాలతో అక్కడిక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన అమెరికాలోని మిస్సౌరిలో జరిగింది.

పోలీసులు తెలపిన వివరాల ప్రకారం
శుక్రవారం మధ్యాహ్నం ఓ పసికందు ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిన్నారిని పరిశీలించగా, కాలిన గాయాలతో అప్పటికే మరణించింది. అయితే, దీనిపై తల్లిని ప్రశ్నించగా, విస్తుపోయే నిజాన్ని బయటపెట్టింది. పసికందును నిద్రబుచ్చేందుకు ఊయలకు బదులుగా పొరపాటున ఓవెన్​లో పెట్టినట్లు పోలీసులకు చెప్పింది. అయితే, ఈ పొరపాటు ఎలా జరిగిందన్న విషయంపై మాత్రం పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

దీంతో తల్లి మరియా థామస్​పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మరణానికి కారణమైందంటూ ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఓ పసికందు జీవితాన్ని కోల్పోయిన ఈ విషాద ఘటనను తమను ఎంతో బాధించిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని న్యాయ వ్యవస్థ కఠినంగా శిక్షిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. అయితే, థామస్​ తరఫున వాదించడానికి న్యాయవాది ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

జాతకాల పిచ్చితో కుమారుడి హత్య
Mother killed son: అంతకుముందు జాతకాల పిచ్చితో నాలుగు నెలల బాలుడిని నదిలో పడేసి హత్య చేసింది ఓ తల్లి. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు తన కుమారుడిని ఎవరో ఎత్తుకెళ్లారని నాటకమాడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగుల్​ జిల్లాలో జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Feb 11, 2024, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details