తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో - డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్​ - Democratic Party Nominee Kamala - DEMOCRATIC PARTY NOMINEE KAMALA

Kamala Harris Declared As Democratic Candidate : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధికార డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున కమలా హారిస్‌ అభ్యర్థిత్వం ఖరారైంది. 59 ఏళ్ల కమల భారత, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు. ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

Kamala Harris Declared As Democratic Candidate
Kamala Harris (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 6:33 AM IST

Updated : Aug 3, 2024, 7:14 AM IST

Kamala Harris Declared As Democratic Candidate :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హారిస్‌ (59) ఖరారయ్యారు. నవంబర్‌ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆమె నేరుగా పోటీ పడనున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చ్‌వల్‌ రోల్‌ కాల్‌లో ఆమె సాధించినట్లు డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీ ఛైర్‌ జేమ్‌ హరిసన్‌ తాజాగా ప్రకటించారు. అంటే అమెరికా అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే కానుంది. డిలిగేట్‌ల ఓటింగ్‌ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కమలా హారిస్​ మెజారిటీ ఓట్లను పొందినట్లు జేమ్‌ హరిసన్‌ పేర్కొన్నారు.

బలప్రదర్శన
చికాగోలో ఈ నెలాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కోసం ర్యాలీ చేపట్టి, తమ బలం ప్రదర్శిస్తామని హరిసన్‌ తెలిపారు. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ-మెయిల్‌ ద్వారా ఓటింగ్‌ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్‌ సోమవారం సాయంత్రం ముగియనుంది. మరోవైపు కమలా హారిస్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఇంత వరకు ఎంపిక చేసుకోలేదు. దీనిపై ఈ వారంతంలోనే ఆమె ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఇక అధికార నామినేషన్‌ ఆగస్టు 7తో ఖరారు కానుంది. డెమోక్రాటిక్​ నామినేషన్‌ విషయంలో ఆమెకు పోటీ ఇచ్చేవారు ఎవరూ దారిదాపులో లేరు.

గౌరవంగా భావిస్తున్నా
డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఖరారు కావడంపై కమలా హారిస్‌ స్పందించారు. "డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దేశం మీద ప్రేమతో, ఉత్తమమైన దాని కోసం పోరాడే వ్యక్తులను ఒక్కటి చేయడమే నా ప్రచారం ఉద్దేశం. మేము మా దేశాన్ని ప్రేమిస్తాం. వాగ్దానాన్ని విశ్వసిస్తాం. వర్చువల్‌ ఓటింగ్‌ సమయం ముగిశాక అధ్యక్ష నామినేషన్‌ను అధికారికంగా అంగీకరిస్తాను’’ అని కమలా పేర్కొన్నారు. ఈ నెలలో చికాగోలో మేము సమావేశం అవుతాము. అందరం ఒక్కపార్టీగా నిలబడతాము. ఈ చరిత్రాత్మక సంఘటనను వేడుక చేసుకుంటాం" అని కమలా హారిస్‌ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కమలా హారిస్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

చరిత్ర సృష్టిస్తారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న భారత, ఆఫ్రికా సంతతికి చెందిన మహిళగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్‌ను స్వీకరిస్తారు. అనంతరం అవే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ విరమించుకున్న నేపథ్యంలో, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ ఇప్పుడు ఆ స్థానంలోకి రానున్నారు. ఆమెకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం.

ఇజ్రాయెల్​తో డైరెక్ట్​ వార్​కు ఇరాన్ సుప్రీం లీడర్​ ఆదేశాలు! IDF హైఅలర్ట్​! - Hezbollah Israel Rocket Attacks

'స్మార్ట్‌ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు' - ఐరాస - UN PRAISES INDIA DIGITAL BOOM

Last Updated : Aug 3, 2024, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details