Israel Attack On Iran Today : గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 38 మంది మృతి చెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. గాజా, లెబనాన్‌పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్ గాజా పట్టిలోని ఖాన్ యూనిస్‌పై శుక్రవారం ఉదయం తదాడి చేసింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆపడం లేదు.
ముగ్గురు జర్నలిస్టులు మృతి
ఇదిలా ఉండగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 3 టీవీ జర్నలిస్టులు చనిపోయినట్లు లెబనాన్ మీడియా పేర్కొంది. మృతుల్లో తమ స్టాఫర్లు- కెమెరా ఆపరేటర్ ఘస్సన్ నజర్, బ్రాడ్కాస్ట్ ఆఫరేటర్ మహ్మద్ రిదా ఉన్నారని బీరుట్కు చెందిన అల్-మయదీన్ టీవీ తెలిపింది. ఇక హెజ్బొల్లా సంస్థకు సంబంధించిన అల్-మనర్ టీవీ, తమ కెమెరా ఆపరేటర్ వాసిమ్ ఖాసిమ్ సైతం ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందినట్లు వెల్లడించింది.
'అల్-జజీరాలో ఆరుగురు ఉగ్రవాదులు'
ఇటీవల ప్రముఖ అరబ్ మీడియా సంస్థ అల్-జజీరాపై ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు ఉగ్రవాదులంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది. పాలస్తీనాకు చెందిన హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లతో వారు కలిసిపోయారని మండిపడింది. కాగా, ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలపై అల్‌జజీరా తీవ్రంగా ఖండించింది.