Houthi Rebels Attack US Ships : ఎర్ర సముద్రంలో మరోసారి హూతీ రెబల్స్ రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురు దాడి చేసి యెమెన్ భూభాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
మరోవైపు, సోమవారం అర్ధరాత్రి MSCస్కై 2 వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో చిక్కుకున్న 23 మంది సిబ్బందిని భారత నౌకదళం సురక్షితంగా రక్షించింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా నౌకతో MSCస్కై 2 నౌకను చేరుకున్న నౌకదళ సిబ్బంది 13 మంది భారతీయులు సహా మొత్తం 23 మందిని కాపాడారు.
తెగిపోయిన డేటా కేబుల్స్
ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్ తెగిపోయినట్లు టెలికాం సంస్థలు, ఓ అమెరికా ప్రభుత్వాధికారి ధ్రువీకరించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆసియా-ఐరోపా మధ్య దాదాపు 25శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. హెచ్‌జీసీ గ్లోబల్ కమ్యూనికేషన్ స్పందిస్తూ ఆ ట్రాఫిక్‌ను వేరే కేబుల్స్‌కు మళ్లించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎలా తెగిపోయాయో కారణం మాత్రం వెల్లడించలేదు.