Congo Jail Incident :డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలు బద్ధలుకొట్టే యత్నం జరిగింది. ఖైదీలంతా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సుమారు 129 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి షబాని లుకో మంగళవారం ఎక్స్‌లో వెల్లడించారు. వీరిలో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.
జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నం- 129 మంది ఖైదీలు మృతి- మరో 59 మంది! - Congo Jail Incident
Congo Jail Incident : కాంగోలో జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించిన 129 మంది ఖైదీలు మరణించారు. వీరంతా తొక్కిసలాటలో చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. కానీ కాల్పుల్లో మరణించారనే అనుమానాన్ని తోటి ఖైదీలు వ్యక్తం చేశారు.
Published : Sep 3, 2024, 11:39 AM IST
"మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు సామూహికంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జరిగిన తొక్కిసలాట, కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతింది" అని మంత్రి షబాని లుకో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అయితే ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని, తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు వ్యాఖ్యానించారు. ఇక ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయని పేర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది.