ముజీబుర్ రెహ్మాన్ 'జాతిపిత' కాదట - చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్! - BANGLADESH CHANGES HISTORY TEXTBOOK
చరిత్రను మార్చేస్తున్న బంగ్లాదేశ్ - స్వాతంత్ర్య ప్రకటన చేసింది అతను కాదట!
![ముజీబుర్ రెహ్మాన్ 'జాతిపిత' కాదట - చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్! Bangladesh changes history in textbooks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2025/1200-675-23245104-thumbnail-16x9-bangladesh.jpg)
Published : Jan 3, 2025, 8:29 AM IST
Bangladesh Changes History Textbook :యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చరిత్రనే మార్చాలని చూస్తోంది. ఇందులో భాగంగా చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేసింది. 2025 మార్చి విద్యాసంవత్సరానికిగాను ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లోంచి బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు ఉన్న 'జాతిపిత' బిరుదును తొలగించింది. అంతేకాకుండా 1971 సమయంలో దేశానికి తొలుత స్వాతంత్య్రం ప్రకటించింది ముజీబుర్ కాదని, అప్పటి సైన్యాధికారి జియావుర్ రెహ్మాన్ అని నూతన పాఠ్య పుస్తాకాల్లో మార్పులు చేసింది. ముజీబుర్ ఆదేశాల మేరకు 1971 మార్చి 27న రెండోసారి జియావుర్ స్వాతంత్య్రం ప్రకటించినట్లు హిస్టరీ పుస్తకాల్లో రాయించింది.