World Malaria Day 2024 :దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతకమైన వ్యాధి మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 249 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. 85 దేశాల్లో దాదాపు 608,000 మంచి మలేరియా కారణంగా మరణించారట. ప్రాణాలను బలితీసుకునే మలేరియాపై అవగాహన పెంచడానికి, నివారణ మార్గాలను కనుగొనడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా మలేరియాను గుర్తించే 10లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మలేరియా ఎందుకు వస్తుంది?
మలేరియా వ్యాప్తికి కారణమయే ఏకైక జీవి దోమ. ప్లాస్మోడియం అనే పరాన్న జీవుల కారణంగా వచ్చే ఈ వ్యాధి, ఇది సోకిన ఆడ అనాఫిలస్ దోమలు కుట్టినప్పుడు మనుషులకు వ్యాప్తిస్తుంది. మలేరియా ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఇతర వ్యక్తిని కుట్టడం కూడా వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి సోకిన వెంటనే మనం గుర్తించలేం. ఇది బయట పడటానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు,గర్భిణిలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలేరియా లక్షణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రాణాంతకం కాకుండా జాగ్రత్త పడచ్చు.
మలేరియా వ్యాధి లక్షణాలు, సంకేతాలు ఏంటి?
1. జ్వరం:
మలేరియా వ్యాధిలో సాధారణంగా కనిపించే లక్షణం అధిక జ్వరం. తీవ్రమైన చలితో జ్వరం వచ్చినప్పుడు మలేరియా టెస్ట్ చేయించుకుంటే మంచిది.
2. తలనొప్పి:
తలనొప్పి అనేది చాలా సాధారణమైన సమస్య. కానీ మలేరియా కారణంగా వచ్చే తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మీరు వాడే సాధారణ తలనొప్పి మాత్రలకు అస్సలు నయం కాదు.
3. అలసట:
జ్వరం వచ్చిన తగ్గిన తర్వాత కూడా విపరీతమైన అలసట, బలహీనంగా అనిపించడం, చిన్న చిన్న పనులు చేయడం కూడా కష్టంగా అనిపించడటం లాంటివి మలేరియా లక్షణాలుగా పరిగణించాలి.
4. కండరాలు, కీళ్ల నొప్పులు:
మలేరియా సోకిన తర్వాత చాలా మందిలో కండరాలు, కీళ్ల నొప్పుడు వస్తుంటాయి. సాధారణంగా అయితే ఇవి ఫ్లూ లక్షణాలుగా భావించవచ్చు. ఎక్కువైతే మాత్రం మలేరియా అని అనుమానించాల్సి ఉంటుంది.
5. వాంతులు, వికారం:
మలేరియాల వికారం, వాంతులు, కడుపు నొప్పి లాంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఈ లక్షణాలు కొన్ని సార్లు డీహైడ్రేషన్, ఎలక్రోలైట్ల అసమతుల్యతకు కూడా దారితీస్తాయి.