Ultra Processed Food Effects :ఆరోగ్యంగా ఉండటానికి రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినా పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. కానీ.. ఇటీవల కాలంలో చాలా మంది జనాలు రుచి పేరుతో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. వీటివల్ల దీర్ఘాకాలికంగా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి అస్సలేతినకూడని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటో మీకు తెలుసా?
బ్రెడ్ :
మనలో చాలా మంది బ్రెడ్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఒకటైన బ్రెడ్‌ను తినడం వల్ల శరీరానికి ఎక్కువగా పోషకాలు అందవు. వీటిని తయారు చేయడానికి రిఫైండ్ ఫ్లోర్, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, చక్కెర, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. అలాగే రంగు, రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, ఎమల్సిఫైయర్లు వాడతారు. అందుకే వీటిని తినడం వల్ల బరువు పెరగడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట.
చాక్లెట్ బిస్కెట్లు :
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా చాక్లెట్ బిస్కెట్లను తింటారు. అయితే.. వీటిని తయారు చేయడానికి రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెర, కోకో పౌడర్, ఉప్పు వంటి వివిధపదార్థాలు వాడతారు. వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇంకా చాక్లెట్ బిస్కెట్లను తినడం వల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ :
చాలా మందికి ఇష్టమైన ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్‌లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. అయితే.. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు అధికంగా ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుందట.
గబగబా తినేస్తున్నారా? ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త! - eating fast problems