What happens if diabetes Do Gym:ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్‌తో బాధపడుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు ఎన్నో కారణాలు. ఇక ఒక్కసారి బ్లడ్‌లో షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటూ, మందులు వాడుకోవడం తప్ప మరో అవకాశం లేదు. అందుకే ముందునుంచి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ క్రమంలోనే చాలా మందికి డయాబెటిస్ ఉంటే జిమ్ చేయవచ్చా అనే డౌట్ వస్తుంటుంది. మరి దీనికి వైద్య నిపుణుల సమాధానం, సలహాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్తో బాధపడేవారు తప్పకుండా జిమ్ చేసుకోవచ్చని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిమ్ చేసే ముందు బ్లడ్ షుగర్ లెవల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలని వివరిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా జిమ్ చేసినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోయే అవకాశం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే జిమ్ చేసిన తర్వాత గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయని అంటున్నారు. కాబట్టి జిమ్ చేసే ముందు షుగర్ లెవల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలని చెబుతున్నారు.
తీసుకోవాల్సిన డైట్: అలాగేజిమ్ చేసే ముందు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లేముందు హెల్దీ కార్బోహైడ్రేట్ డైట్ ఉదాహరణకు అరటి, యాపిల్ పండ్లు తీసుకుంటే షుగర్ లెవల్స్ పడిపోకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.
జిమ్‌లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి:కాంబినేషన్ ఆఫ్ ఎరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే వెయిల్ లిఫ్టింగ్, పుష్ అప్స్, పుల్ అప్స్ వంటివి. ఎరోబిక్స్ వ్యాయామాలు అంటే థ్రెడ్ మిల్, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి. కాబట్టి జిమ్‌లో ఈ రెండు కాంబినేషన్స్ ట్రై చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యానికి, మజిల్ గెయిన్కు హెల్ప్ అవుతాయని డాక్టర్ రవిశంకర్ చెబుతున్నారు.