Avoid These Food Combinations for Weight Loss :నేటి రోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు ఆఫీసుల్లో కూర్చోవడం కారణంగా ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత, లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. ఈ క్రమంలోనే బరువు ఎక్కువ ఉన్నవారు ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అందులో భాగాంగానే చాలా మంది అధిక బరువు సమస్యను దూరం చేసుకోవడానికి ఆహార నియమాలతో పాటు వ్యాయామ రొటీన్‌నీ పాటిస్తుంటారు. అయితే, బరువు తగ్గాలంటే వాటిని ఫాలో అవ్వడమే కాకుండా మీరు తీసుకునే పదార్థాల్లో కొన్ని కలిపి తీసుకోకూడదంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని. అప్పుడే ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువూ తగ్గచ్చంటున్నారు. ఇంతకీ, వెయిట్ లాస్ అవ్వాలంటే తీసుకోకూడని ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓట్స్+డ్రై ఫ్రూట్స్ : వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారిలో చాలా మంది ఓట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటుంటారు. వీటిలో చక్కెర స్థాయులు తక్కువ ఉండడమే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే, కొంతమంది మాత్రం ప్రొటీన్స్ కోసం ఓట్స్, డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం అటుంచితే వెయిట్ పెరిగే ఛాన్సే ఎక్కువగా ఉంటుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు.
అన్నం+ఆలుగడ్డలు : ఇది బరువు తగ్గాలనుకునేవారు కలిపి తీసుకోకూడని మరో ఫుడ్ కాంబినేషన్. ఎందుకంటే బంగాళదుంపల్లోస్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అన్నంతో కలిపి తీసుకున్నప్పుడు వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ రెండింటినీ కలిపి తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు. అయితే, వీటిని విడివిడిగా అదీ తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని సూచిస్తున్నారు.
ఆశ్చర్యం : బరువు తగ్గడానికి బంగాళాదుంపలు! - నిపుణులు చెబుతున్నది ఇదే!