Ways To Get Rid Of Dry Skin :వయసు పైబడిన వారిలో సాధారణంగానే చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఇక శీతాకాలంలో దాదాపు మనందరి స్కిన్ డ్రైగా మారిపోతుంటుంది. కానీ.. కొంతమంది శరీరం మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ డ్రైగా ఉంటుంది. దీంతో చర్మం గరుకుగా మారి దురద సమస్య కూడా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే.. చాలా మంది డ్రై స్కిన్‌తో బాధపడేవారు మార్కెట్లో దొరికే రకరకాల లోషన్లు, క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. వీటివల్ల కొంతమందిలో త్వరగా ఉపశమనం లభిస్తే.. మరికొందరిలో కాస్త ఆలస్యంగా ప్రభావం కనిపిస్తుంది.
అమెరికాలోని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌లో (report)చీఫ్ మెడికల్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రముఖ 'డాక్టర్ హోవార్డ్ E. లెవైన్'.. చర్మం పొడిబారకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవి మీ కోసం..
వెదర్ చల్లగా ఉన్నప్పుడు, అలాగే తక్కువ తేమ ఉన్న వాతావరణంలో మన చర్మం పొడిగా మారుతుంది. ఇంకా తరచుగా స్నానం చేయడం, కఠినమైన సబ్బులను ఉపయోగించడం, కొన్ని రకాల స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చర్మం పొడిబారుతుంటుంది.
డ్రై స్కిన్ సమస్యను తగ్గించుకోవడానికి స్కిన్ మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. ఇవి చర్మంపైనున్న పొరను రీహైడ్రేట్ చేసి.. తేమ కోల్పోకుండా కాపాడుతుంది. మాయిశ్చరైజర్లలో చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల పదార్థాలు సహాయపడతాయని డాక్టర్ హోవార్డ్ E. లెవైన్ చెబుతున్నారు.
ఈ టిప్స్ పాటించండి :
- శీతాకాలంలో మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్ తప్పకుండా ఉపయోగించండి. దీంతో వింటర్ సీజన్లో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.
- కొంతమంది చాలా సమయంపాటు వేడినీళ్లతో షవర్ కింద స్నానం చేస్తుంటారు. దీంతో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది.
- కాబట్టి, ఎక్కువసేపు స్నానం చేయకుండా 5-10 నిమిషాలలో స్నానం ముగించుకుని బయటకు రావాలి.
- అలాగే స్నానానికి వేడి నీళ్లు కాకుండా.. గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
- మనం స్నానానికి ఉపయోగించే కొన్ని రకాల సోప్‌లు కూడా చర్మం పొడిబారేలా చేస్తాయి. కాబట్టి గ్లిజరిన్, మాయిశ్చరైజర్‌తో కూడిన సబ్బులను వాడాలి. ఇవి చర్మన్ని తేమగా ఉంచుతాయి.
- కొంతమందికి స్నానం చేసేటప్పుడు లూఫా, స్పాంజ్లు వాడే అలవాటు ఉంటుంది. అయితే, మీకు డ్రై స్కిన్ సమస్య ఉంటే వీటికి దూరంగా ఉండడం మంచిది.
- స్నానం చేసిన తర్వాత పొడిగా ఉండే టవల్‌తో గట్టిగా రుద్దుకోకూడదు. చర్మాన్ని మృదువైన టవల్‌తో తుడుచుకోవాలి.
- స్నానం చేసిన తర్వాత లేదా చేతులు కడుక్కున్న వెంటనే తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్ హెల్దీగా, డ్రైగా కాకుండా ఉంటుంది.
- చర్మం గరుకుగా ఉన్నట్లు అనిపిస్తే.. కొద్దిగా పెట్రోలియం జెల్లీ చేతులకు రాసుకుని చర్మంపై అప్లై చేసుకోండి. దీంతో స్కిన్ మృదువుగా మారడంతో పాటు దురద కూడా తగ్గుతుంది.
- బట్టలు ఉతకడానికి సువాసన లేని డిటర్జెంట్లను ఉపయోగించండి.
- చర్మానికి చికాకు కలిగించే ఉన్ని, ఇతర రకాల వస్త్రాలను ధరించకండి.
- ఈ టిప్స్ పాటించడం ద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చని డాక్టర్ హోవార్డ్ E. లెవైన్ చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
అమ్మాయిలూ పొడి చర్మం ఉందా.. ఇలా ప్రయత్నించండి
పొడి చర్మానికి పరిమళ రక్ష