Warning Signs of Diabetes on Skin :వయసుతో సంబంధం లేకుండా విస్తరిస్తోన్న వ్యాధి.. డయాబెటిస్. సాధారణంగా మన బాడీలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు.. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉయోగించలేనప్పుడు.. షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. అయితే.. రక్తంలో చక్కెర స్థాయులను తెలుసుకోవాలంటే టెస్టులు మాత్రమే కాకుండా.. చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే.. మనకి మధుమేహం వచ్చిందో లేదో విషయాన్ని ఈ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, చర్మంపై కనిపించే ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
డయాబెటిస్‌తో ఇబ్బందిపడుతున్నారా? - ఈ యోగాసనాలతో ఫుల్ బెనిఫిట్!
డయాబెటిక్ పేషెంట్లలో చర్మ సమస్యలు:అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, పొక్కులు వంటి కొన్ని చర్మ సమస్యలు ఉంటాయి. ఈ చర్మ సమస్యలు ఎవరికైనా సంభవించవచ్చు. అయితే డయాబెటిక్ రోగులలో చర్మాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తాయి. అవేంటంటే..
ప్యాచెస్(patches): మధుమేహం ఉన్న వ్యక్తులలో చర్మంపై ప్యాచెస్ రావడం చాలా సాధారణం. ఈ ప్యాచెస్ చాలా రకాలుగా ఉండవచ్చు. ఇవి మొదటగా చిన్నగా ప్రారంభమవుతాయి. తర్వాతర్వాత మొటిమలుగా కనిపిస్తాయి. ఆ తర్వాత అక్కడ చర్మం వాపు వచ్చి గట్టిగా మారుతుంది. దీనినే నెక్రోబయోసిస్ లిపోడికా అని పిలుస్తారు. అలాగే ఈ ప్రదేశంలో చర్మంపై దురద ఉండటంతో పాటు నొప్పిగా కూడా ఉంటుంది.
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!!
డార్క్ స్కిన్:ఈ మచ్చలు చర్మం మడతలలో ముఖ్యంగా.. మెడ, చంకలు, మోకాళ్లు, గజ్జల చుట్టూ బ్లాక్ కలర్లో రౌండ్ షేప్‌లో ఉంటాయి. అంటే దీని అర్థం.. మీ రక్తంలో ఇన్సులిన్ చాలా ఎక్కువగా ఉందని.. ఇది ప్రీడయాబెటిస్‌కు సాధారణ సంకేతమని వైద్యులు అంటున్నారు. దీనినే అకాంటోసిస్ నైగ్రికాన్ 1 అని కూడా పిలుస్తారు. ఈ చర్మ పరిస్థితి ఎక్కువగా అధిక బరువు ఉన్నవారిలో సంభవిస్తుంది.