తెలంగాణ

telangana

ETV Bharat / health

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా! - best walking method

Walking Tips To Lose Weight : బరువు తగ్గడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తున్నా.. మీ శరీరంలో మార్పు కనిపించలేదా? దీనికి.. వాకింగ్‌ చేసేటప్పుడు మీరు మిస్టేక్స్‌ కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటి? నడిచేటప్పుడు ఎటువంటి టిప్స్‌ పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Walking Tips To Lose Weight
Walking Tips To Lose Weight

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 12:38 PM IST

Walking Tips To Lose Weight :వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు జిమ్‌కు వెళ్లకుండా బరువు తగ్గాలనుకుంటే.. వాకింగ్‌కు మించిన మంత్రం వేరే లేదనే చెప్పొచ్చు. కేవలం రోజూ నడక ద్వారా వెయిట్‌ లాస్ అవ్వొచ్చా అంటే అవుననే అంటున్నారు నిపుణులు! కానీ, వాకింగ్‌ చేసేటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాలతో త్వరగా వెయిట్‌ లాస్‌..

  • మనలో చాలా మంది నడుస్తున్నప్పుడు మడమను నేలకు అనించకుండా నడుస్తుంటారు. కానీ, ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా పాదం నేలను తాకాలని అంటున్నారు.
  • కొంత మంది వాకింగ్‌ చేసేటప్పుడు చాలా స్లోగా నడుస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీరు నడిచిన అరగంటైనా కొంచెం స్పీడ్‌గా నడవాలని సూచిస్తున్నారు. అప్పుడే శరీరానికి చెమట పట్టి తొందరగా బరువు తగ్గుతారని తెలియజేస్తున్నారు.
  • చాలా మంది వాకింగ్‌ చేసేటప్పుడు షూ ధరించకుండా చెప్పులతోనే నడుస్తారు. దీనివల్ల పాదాలకు ఏదైనా గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి షూ ధరించి వాకింగ్‌కు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • వాకింగ్ చేసేటప్పడు వీలైతే చిన్న డంబెల్స్‌ను పట్టుకుని నడవండి. ఇలా చేయడం వల్ల మరింత ఫలితం ఉంటుంది.
  • నడిచేటప్పుడు చేతులను ఖాళీగా ఉంచకుండా.. అటూ ఇటూ తిప్పుతూ వాకింగ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అన్ని కండరాలకు శారీరక శ్రమ కలుగుతుంది.
  • మీ ఇంటికి సమీపంలో ఏదైనా కొండ లాంటి ఎత్తైన ప్రదేశం ఉంటే అక్కడికి నడుస్తూ వెళ్లండి. దీనివల్ల సాధారణ రోడ్లపై నడిచిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులంటున్నారు.
  • నడిచేటప్పుడు వంగకుండా వీపును నిటారుగా ఉంచి నడవాలి. ఇలా చేస్తేనే ఎక్కువ క్యాలరీలు బర్న్‌ అవుతాయి.
  • వాకింగ్‌ నుంచి ఇంటికి వచ్చిన తరవాత స్నానం చేసి.. ఒక కప్పు గ్రీన్‌ టీని తాగండి. దీనివల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

నడకతోపాటు ఇవి కూడా..
రోజూ నడవడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులంటున్నారు. డైట్‌లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలుండే క్యాబేజీ, ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి వాటిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉండే బెర్రీలు, పుచ్చకాయలు, కమలాపండ్లు, నారింజలను తినాలని చెబుతున్నారు. తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ టిప్స్ పాటిస్తే.. తప్పకుండా తక్కువ వ్యవధిలోనే బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.

కచ్చితంగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా? దానిని తింటే ఫలితం గ్యారెంటీ!

వయసును బట్టి నడక - మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details