తెలంగాణ

telangana

ETV Bharat / health

ఫేస్​ రెడ్​గా మారిందా ? ఈ టిప్స్‌తో రిలీఫ్​ పొందండి! - skin redness problems

Tips To Reduce Redness On Your Face : ఒక్కొక్కసారి ముఖం అకస్మాత్తుగా ఎర్రగా మారిపోతూ ఉంటుంది. దీని కారణంగా అందం అంతా దెబ్బతింటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ? దీనికి చాలా కారణాలున్నాయని నిపుణులంటున్నారు. అయితే, ఈ సమస్య నుంచి గట్టేక్కడానికి కొన్ని టిప్స్‌ పాటించమని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips To Reduce Redness On Your Face
Tips To Reduce Redness On Your Face

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 5:30 PM IST

Tips To Reduce Redness On Your Face :అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార పనుల కోసం యువతులు కాలు బయటపెట్టడం సాధారణంగా మారిపోయింది. అలాంటి సమయంలో వారు చర్మ సౌందర్యం కోసం ముఖానికి స్కార్ఫ్ వంటివి ధరించడంతో పాటు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా చాలా మందిలో ముఖం పెయింట్​ వేసినట్లుగా ఎర్రగా మారుతుంటుంది. అసలు చర్మం ఎర్రగా మారడానికి కారణాలు ఏంటి..? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి టిప్స్​ పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ముఖం ఎర్రగా మారడానికి కారణాలు:సున్నితమైన చర్మం ఉన్న వారి ముఖం ఎర్రగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముఖానికి రాసుకునే కొన్ని రకాల క్రీముల్లో ఉండే సోడియం లారిల్ సల్ఫేట్‌, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, గాలి, వేడి వాతావరణం, చల్ల వాతావరణం, స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, వేడి నీటి స్నానం, హాట్​ డ్రింక్స్​, కొన్ని రకాల అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యల వంటివి కూడా చర్మాన్ని ఎర్రగా మారేలా చేస్తాయంటున్నారు. మరి ఈ సమస్య నుంచి రిలీఫ్​ పొందాలంటే..

అలోవెరా జెల్‌..:ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్​కి ఎంతో హెల్ప్ చేస్తాయి. కాబట్టి.. మీ ముఖం ఎర్రగా మారిన చోట సహజంగా లభించే అలోవెరా జెల్‌తో ఫేస్‌ ప్యాక్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 10 నుంచి 15 నిమిషాల తరవాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలని.. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

కీరదోస ముక్కలతో..:కీరదోసతో కూడా ఫేస్​పై ఉండే రెడ్​ కలర్​ను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.ఇందుకోసం ముందుగా కొన్ని కీరదోస ముక్కలను పేస్ట్​లాగా చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరవాత మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లాగా అప్లై చేసుకోని ఓ పది నిమిషాల తర్వాత వాష్​ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రిలీఫ్​ పొందవచ్చు.

ఓట్స్‌తో..:మనం తినే ఓట్స్‌తో కూడా ముఖాన్ని రెడ్​ కలర్​ బారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు. ఇందుకోసం ఒక కప్పు ఓట్స్‌ను తీసుకోవాలి. అందులోకి కొన్ని నీళ్లను పోసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తరవాత దాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 నుంచి 20 నిమిషాల తరవాత క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద పోయి, చర్మం పొడిబారకుండా ఉంటుంది.

ఆపిల్​ సైడర్​ వెనిగర్​: రాత్రి పడుకునే ముందు ఫేస్​పై ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో మసాజ్‌ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమల సమస్య కూడా దూరం అవుతుంది.

ఆహారంలో మార్పు..:మీ ముఖం తరచూ ఎర్రగా మారుతుంటే కచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చర్మాన్ని మెరిసేలా చేసే విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలను తినాలి. అలాగే విటమిన్‌ సి ఎక్కువగా ఉంటే నారింజ, ద్రాక్ష, బ్రోకలీ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలు, నట్స్ వంటి వాటిని తరచూ తీసుకోవాలి. ఇంకా కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.

చర్మం పొడి బారకుండా చూసుకోవాలి..మన శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా చర్మం ఎర్రగా మారుతుంది. కాబట్టి, ఎక్కువగా నీళ్లు తాగాలి. అలాగే చర్మం పొడిబారకుండా ఉండటానికి బాదం, కొబ్బరి, ఆలివ్‌ నూనెలతో రాత్రి సమయంలో మసాజ్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎండలోకి వెళ్లేముందు చర్మానికి సన్​ స్క్రీన్​ లోషన్​ వంటివి రాసుకోవాలని చెబుతున్నారు. ముఖానికి స్కార్ఫ్‌ వంటివి తప్పకుండా ధరించాలి.

కీళ్లవాతాన్ని విటమిన్‌ డి తగ్గిస్తుందా ? నిపుణులు ఏమంటున్నారు ?

మేకప్ వేసుకుంటే - క్యాన్సర్ వస్తుందా?

అలర్ట్ : అతి చలిగా అనిపిస్తోందా? ​- ఈ సమస్యే కావొచ్చట!

ABOUT THE AUTHOR

...view details