Tips For Reducing Neck Wrinkles : ఎల్లపుడూ యవ్వనంగా కనిపించాలనుకునే చాలా మంది ఎదుర్కునే సమస్య మెడపై ముడతలు, సన్నని గీతలు. వయసు పెరిగే కొద్దీ చర్మం స్థితిస్థాపకతను కోల్పోయి, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి వదులుగా మారుతుంది. ఫలితంగా సన్నని గీతలు ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. వీటితో పాటు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు ఎక్కువ సేపు చూడటం, సూర్య రష్మి, మద్యం, ఊబకాయం, ధూమపానం వంటి ఇతర కారణాల వల్ల కూడా మెడపై ముడతలు ఏర్పడతాయి. మహిళలు, సౌందర్య ప్రియులకు ఇది ఆందోళన కలిగించే సమస్య అనే చెప్పుకోవచ్చు. వీటిని తగ్గించకోవడం ఎలా ఆలోచిస్తున్నవారికి ఇదిగో ఇవే చక్కడి మార్గాలు!
సూర్య రష్మి
చర్మం యవ్వనంగా కనిపించడానికి సూర్య రష్మి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మెడపై ముడతలు, సన్నని గీతలు రాకుండా ఉండాలంటే మీరు సన్ ప్రొటెక్షన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సూర్యుని నుంచి విడుదలయ్యే హానికరమైన కిరణాల కారణంగా చర్మంపై ఏర్పడతాయి. కాబట్టి మీరు సన్ స్క్రీన్ లోషన్లు ఎల్లప్పుడూ రాసుకోవడం మంచిది. ఇవి యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడతాయి. వీటితో పాటు బయటకు వెళ్లినప్పుడు నేరుగా మెడపై ఎండ పడకుండా టోపీ, స్కార్ఫ్, మెడను దాచేసే దుస్తులను ధరించాలి.
మాయిశ్చరైజేషన్
చర్మాన్ని బాగా తేమగా ఉంచడం వల్ల స్థితిస్థాపకతను కాపాడుకోవచ్చు. మెడపై ముడతలు తగ్గడానికి మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా మెడ చుట్టూ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. ఇది మీ చర్మానికి పోషణనిచ్చి చర్మాకృతిని యవ్వనంగా మార్చుతుది. ముఖ్యంగా హైలురోనిక్ యాసిడ్, సిరమైడ్, పెప్టైడ్స్, విటమిన్-సీ కలిగిన క్రీములు మీ చర్మన్ని మృదువుగా మార్చేందుకు బాగా సహాయపడతాయి.
రెటినోల్స్
రెటినోల్ ఉత్పత్తులు యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్-ఏ డెరివేటివ్ కొల్లాజెన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. వీటితో పాటు రేడియో ఫ్రీక్వెన్సీతో మెక్రోనెడ్లింగ్ చికిత్స కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.