తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ చిన్న పనిచేస్తే మీ ఆయుష్షు 11 ఏళ్లు పెరుగుతుందట! - పరిశోధనలో ఆసక్తికర విషయాలు! - ACTIVITY INCREASE LIFE EXPECTANCY

-శారీరకంగా చురుగ్గా ఉండేవారిలో 11ఏళ్లు పెరిగే ఛాన్స్ -బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడి

Physical Activity Increase Life Expectancy
Physical Activity Increase Life Expectancy (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 15, 2024, 4:18 PM IST

Physical Activity Increase Life Expectancy:మీరు రోజూ సుమారు రెండున్నర గంటల పాటు నడుస్తున్నారా? అయితే, మీ జీవిత కాలం మరో 11 ఏళ్లు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండున్నర గంటలకు పైగా నడిచే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గిపోయినట్లు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా ఆయుష్షు పెరుగుదలకు సాయం చేస్తుందని తేలింది. అమెరికాలోని National Center for Health Statistics, 2003–2006 National Health and Nutritional Examination Survey, 2019 జనాభా లెక్కలను ఉపయోగించి ఈ అధ్యయనం చేపట్టారు.

40 ఏళ్ల వయసు దాటిన అమెరికన్లలో 25 శాతం మంది కొద్దిగా శారీరకంగా చురుకుగా ఉంటే సుమారు 5 ఏళ్లు ఎక్కువ బతికే అవకాశం ఉన్నట్లు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్​ అధ్యయనంలో బయటపడింది. ఇంకా తక్కువ చురుకుగా ఉన్నవారితో పోలిస్తే ఎక్కువ శారీరకంగా చురుకుగా ఉన్న వారి ఆయుష్షు సుమారు 11 ఏళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధ్యయనం అంచనా వేసింది. తక్కవ శారీరక శ్రమ చేసే వారిలో గుండె జబ్బులు వస్తాయని.. అకాల మరణం సంభవించే అవకాశం ఎక్కువని పరిశోధకులు అంటున్నారు.

40 ఏళ్లు దాటిన 25 శాతం మంది చురుకైన వారి మొత్తం శారీరక శ్రమ ప్రతి రోజు గంటకు 4.8 కిలోమీటర్లు లేదా 160 నిమిషాల వేగవంతమైన నడకకు సమానంగా ఉన్నాయని తెలిపారు. దీని ఆధారంగా వీరంతా ప్రతిరోజూ ఈ స్థాయిలో శారీరక శ్రమ చేస్తే వారి సగటు జీవిత కాలం 5 ఏళ్లు పెరుగుతుందని చెబుతున్నారు. వారి ఆయుష్షు 78.6 సంవత్సరాల నుంచి 84ఏళ్లకు పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, శారీరకంగా చురుగ్గా ఉండే వారితో పోలిస్తే అతి తక్కువ చురుకైన వారు అదనంగా సుమారు 111 నిమిషాలు నడవాల్సి ఉంటుందని.. ఇలా చేస్తే వారి ఆయుష్షు సుమారు 11 ఏళ్లు పెరుగుతుందని వివరించారు. ఫలితంగా ప్రతి అదనపు గంట నడడ వీరి ఆయుష్షును దాదాపు 6 గంటలు పెంచుతుందని వెల్లడించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చపాతీ vs అన్నం - షుగర్ రోగులు ఏది తింటే బెటర్? కూరల్లో ఇవి ఉంటే బెస్ట్!!

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? వాటర్ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయట తెలుసా?

ABOUT THE AUTHOR

...view details