Pregnants Should Avoid These Foods :ఆరోగ్యం విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. తల్లికి, కడుపులోని బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంటుంది. తినే ఆహారం విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఏది పడితే అది తినకూడదు, బయటి తినుబండారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కానీ.. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు ఆహార కోరికలు పెరుగుతాయి. రకరకాల తిండిని టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా మంది గర్భిణులు(Pregnants)అల్ట్రాప్రాసెస్డ్, ఫాస్ట్ఫుడ్స్ తింటుంటారు. ఈ ఫుడ్స్ పై ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భిణులు చీజ్‌బర్గర్ లేదా ప్యాక్ చేసిన పేస్ట్రీలు వంటి అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్ తినడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు తినే చిప్స్, పేస్ట్రీల ప్యాకేజింగ్‌కి ఉపయోగించే కవర్లు ప్లాస్టిక్‌లతో సంబంధం ఉన్న రసాయనాలతో తయారవుతాయి. ముఖ్యంగా వీటిలో థాలెట్స్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఈ థాలెట్స్.. మీరు తినే ప్యాకెజ్డ్ ఫుడ్స్, బర్గర్లు, పిజ్జా వంటి ఆహారంలోకి రిలీజ్ అవుతుంది. ఈ రసాయనం కడుపులోపలి పిండంపై ప్రభావం చూపిస్తుందట. గర్భిణులు వీటిని తింటే ఈ రసాయనాలు ప్లాసెంటా ద్వారా పిండం రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల ఈ ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ అస్సలే తినొద్దని సూచిస్తున్నారు.
Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?