Teeth Whitening Foods :ఎక్కువ మంది ముఖం, జుట్టు ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ.. నోటి ఆరోగ్యం మీద పెట్టరు. ఉదయాన్నే ఏదో మొక్కుబడిగా బ్రష్ చేసి పరుగులు తీస్తుంటారు. దీంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం, నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్యపూరిత అలవాట్ల వల్ల కొంతమంది దంతాలుకూడా పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే, దంతాలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు, అవి తళతళా మెరిసిపోవడానికి రోజూ ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాలు, పాల పదార్థాలు :
పాలు, పదార్థాలలో ఉండే క్యాల్షియం, మాంసకృత్తులు దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడతాయి. వీటిలోని ల్యాక్టికామ్లం దంతాలు హెల్దీగా ఉండేలా చేస్తాయి. తరచూ పెరుగు, జున్ను తినడం వల్ల దంతాలు మెరుస్తాయి. పెరుగులోని ఫాస్ఫరస్ దంతాలు రంగు మారకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రకోలీ :
దంతాలపై ఏర్పడిన పసుపు రంగును తొలగించడానికి బ్రకోలీ సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల దంతాలు బలంగా ఉంటాయి. అలాగే చిగుళ్ల వాపు కూడా తగ్గుతుంది.
స్ట్రాబెర్రీలు :
వీటిలో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలపైన ఉండే పసుపు రంగును తొలగించి మెరిపిస్తుంది. స్ట్రాబెర్రీలలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. అలాగే చిగుళ్లలో వాపు రాకుండా చేస్తాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల దంతాలపై పసుపు రంగు తొలగిపోతుందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సిట్రస్ పండ్లు :
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలపై ఏర్పడిన మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే తరచూ సిట్రస్ పండ్లను డైట్లో భాగం చేసుకోవాలి.