Sugarless Sweets for Diabetes:డయాబెటిస్ ఎటాక్ అయితే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇక, స్వీట్స్ తినే విషయంలో ఆందోళన మామూలుగా ఉండదు. ఓ పక్క స్వీట్స్ తినాలని ఉంటుంది.. మరోపక్క తింటే ఇంకా షుగర్ పెరుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఈ క్రమంలో దీపావళి పండగ వేళ షుగర్ పేషెంట్స్‌కు గుడ్‌న్యూస్ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ ఉన్నవాళ్లు కూడా తినే కొన్ని స్వీట్స్ ఉన్నాయట. మరి.. అవి ఏంటో తెలుసుకుని.. పండగ పూట నోరూ కట్టేసుకోకుండా తినేయండి.
డ్రై ఫ్రూట్ స్వీట్:పండగ ఏదైనా స్వీట్ చేయాలంటే బెల్లం లేదా చక్కెర ఉపయోగించి చేయాల్సిందే. వీటితో చేసినవి తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుంది. అయితే.. ఈ స్వీట్ చక్కెర, బెల్లం ఉపయోగించకుండా తయారు చేయవచ్చు. ఈ స్వీట్ తింటే ఆరోగ్యం కూడా లభిస్తుందని NIH సభ్యుల బృందం చేసిన అధ్యయనంలో తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలను దోరగా వేయించుకోవాలి.
- ఇప్పుడు వీటన్నింటిని మిక్సీజార్‌లోకి వేసి అందులోకి డేట్స్ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
- ఖర్జూరంలోని తీపి పదార్థం ఈ ముద్దను తీపిగా చేస్తుంది.
- తర్వాత నెయ్యితో నచ్చిన సైజ్‌లో చిన్నచిన్న బాల్స్‌లా చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ.
బాదం బర్ఫీ: ఇది షుగర్ పేషెంట్స్‌కు ఆరోగ్యకరమైన స్వీట్. షాపుల్లో కొనుగోలు చేసిన దాని కంటే ఇంట్లో చేసుకుంటే దీని రుచి బాగుంటుంది. అందుకోసం..
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బాదంపప్పులను దోరగా వేయించి కొద్దిగా దంచాలి.
- దానిలో కాస్త తేనె, నెయ్యి వేసి కావాల్సిన ఆకారం ఇస్తే కమ్మని బర్ఫీ రెడీ.
- ఈ బర్ఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట.