ETV Bharat / international

డొనాల్డ్ ట్రంప్​నకు భారీ ఊరట - 2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత - TRUMP INDICTMENT CASE

డొనాల్డ్‌ ట్రంప్‌పై గతంలో నమోదైన 2020 నాటి ఎన్నికల కేసులో ఊరట - కేసును కొట్టివేసిన న్యాయస్థానం - అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకే!

Donald Trump
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 10:59 AM IST

Trump 2020 Election Case : త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు క్రిమినల్‌ కేసులను కొట్టివేసింది. రహస్యపత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతోపాటు 2020ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించిన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.

అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై ఉన్న 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాది జాక్‌ స్మిత్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్‌ అంగీకరిస్తూ, ఈ కేసును కొట్టివేయటం సముచితమని పేర్కొన్నారు.

'అమెరికాలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు'
2020 ఎన్నికల నాటి కేసును కొట్టివేయడంపై ట్రంప్ స్పందిస్తూ, ఈ కేసులు చట్టవిరుద్ధమైనదని అన్నారు. తనపై పోరాడేందుకు డెమొక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100మిలియన్‌ డాలర్లు వృథా చేశారని ఆరోపించారు. ఇంతకుముందు అమెరికాలో ఇలాంటివి జరగలేదని ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇదీ కేసు
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌ ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్‌హౌస్‌ నుంచి పలు కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు ఎప్పుడూ విచారణకు రాకపోవడం గమనార్హం. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం సిట్టింగ్‌ అధ్యక్షుడు క్రిమినల్‌ విచారణను ఎదుర్కోకుండా ఉండేందుకు వారికి రక్షణ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించడం వల్ల మరికొన్ని రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో గతంలో ఆయనపై నమోదైన పలు కేసుల్లో ఊరట లభిస్తుంది. ఇటీవల హష్‌ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష ఖారారయినప్పటికీ, ఆ శిక్షను విధించకుండా నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్‌ జడ్జి తీర్పునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.