Sugar Patients Avoid Breakfast Food :రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే కచ్చితంగా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందేనని నిపుణులంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితోబాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి ఎక్కువగా పోషకాలు ఉండే టిఫెన్ తినాలని సూచిస్తారు. అయితే, ఇక్కడ.. డయాబెటిస్ ఉన్న వారు కొన్ని ఆహార పదార్థాలు అస్సలే తినకూడదని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల షుగర్ అదుపులో ఉండదని అంటున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇంతకీ చక్కెర వ్యాధి ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పండ్ల రసాలు :
మధుమేహంతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పండ్ల రసాలలో ఫైబర్ తక్కువ ఉండి, చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. 2008లో "డయాబెటిస్ కేర్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మధుమేహంఉన్న వారు ఉదయాన్నే పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో అమెరికాలోని 'మిన్నెసోటా విశ్వవిద్యాలయం'లో పని చేసే డాక్టర్ డేవిడ్ జె. లెవిన్ పాల్గొన్నారు. షుగర్ వ్యాధి ఉన్న వారు ఉదయాన్నే పండ్ల రసాలు తాగడం వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
బ్రెడ్, బన్ :
మార్కెట్లో దొరికే చాలా రకాల బ్రెడ్, బన్‌లను తయారు చేయడానికి ఎక్కువ షుగర్, ప్రాసెస్డ్ పిండి పదార్థాలు, హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ వంటి వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. అయితే.. మధుమేహం ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కార్న్ ఫ్లేక్స్/సీరియల్ బార్‌లు/మ్యూస్లీ :
కొంత మంది ఉదయాన్నే పాలలో కార్న్ ఫ్లేక్స్, మ్యూస్లీ వంటివి తింటుంటారు. అయితే, మార్కెట్లో దొరికే చాలా వాటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.