Sugar Control Foods In Telugu :టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు సాధారణంగా తమ షుగర్ లెవెల్స్‌ను మందులతో లేదా ఇన్సులిన్ లేదా ఇతర మార్గాల ద్వారా నియంత్రణలో పెట్టుకుందామని అనుకుంటారు. వీటన్నింటితో పాటు డైట్ పాటించడమూ తప్పనిసరని సూచిస్తున్నారు వైద్యులు. మనం తీసుకునే ఆహారం నుంచే రక్తంలోకి గ్లూకోజ్ చేరుతుంది. అందుకే దీనిని ఎంత వరకు నియంత్రించుకుంటే అంత మంచిది. మనం తీసుకునే గ్లూకోజ్, శరీరంలోని బ్లడ్‌గ్లూకోజ్ స్థాయులపై ప్రభావం చూపుతుంది.
ఈ ఆహారానికి దూరం!
టైప్- 2 డయాబెటిస్ బాధితులు తినకూడని ఆహార పదార్థాలేంటంటే, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం. వీటిల్లో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. దీంతో ఈ ఫుడ్‌ను తిన్న వెంటనే బ్లడ్‌లో షుగర్ స్థాయులు పెరుగుతాయి. అయితే ఈ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే టైప్- 2 డయాబెటిస్ బాధితులు ఈ టైప్ ఫుడ్‌ను తక్కువగా తీసుకోవడం గానీ పూర్తిగా మానేయడం కానీ చేయాలని అంటున్నారు పోషకాహార నిపుణులు.
హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలివే!
చక్కెరతో చేసిన పదార్థాలు, ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ఉన్న పదార్థాలు. ఉదాహరణకు అన్నం, మైదాపిండి వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది. వీటిని తక్కువ మోతాదులో తినడం ద్వారా పెద్దగా ప్రభావం ఉండదు కానీ, వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ఉత్తమం. మామిడి, అరటిపండ్లు తినేటప్పుడు మీ బ్లడ్‌షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది. అంతేగాక డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం శ్రేయస్కరం.