తెలంగాణ

telangana

ఏం చేసినా ముఖంపై జిడ్డు వదలట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్! - Tips For Managing Oily Skin

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 1:44 PM IST

Tips For Managing Oily Skin : కొంత మంది ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ముఖం జిడ్డుగా మారుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్​తోపాటు వివిధ రకాల క్రీములు వాడినా ఫలితం లేకుండా పోతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, ఈ టిప్స్ తెలుసుకోండి.

Best Tips To Reduce Oily Skin
Tips For Managing Oily Skin (ETV Bharat)

Best Tips To Reduce Oily Skin : ముఖం అందంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు? కానీ.. కొంతమందిని కాలంతో సంబంధం లేకుండా జిడ్డు సమస్య వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల మాయిశ్చరైజర్​లు యూజ్ చేస్తుంటారు. అయినా.. కొందరి ముఖం జిడ్డుగానే కనిపిస్తోంది. ఆయిలీ స్కిన్ వారు మాత్రమే కాకుండా.. డ్రై స్కిన్ వారు కూడా ఈ ప్రాబ్లమ్​ను ఫేస్ చేస్తుంటారు. మీది డ్రై స్కిన్ అయి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే, రోజువారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా.. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని ఇలా మూడు రకాల చర్మాలు ఉంటాయి. కొందరిలో హార్మోన్స్ ప్రభావం వల్ల ఆయిల్ ఉత్పత్తిచేసే గ్రంథులు ఎక్కువగా ఉద్దీపన చెందుతాయి. ఫలితంగా ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఇక డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య తలెత్తితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం దాని ఉపశమనం పొందవచ్చంటున్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని.

పొడి చర్మం ఉన్నవారికి స్కిన్ గరుకుగా, నిర్జీవంగా కనిపిస్తుంది. కొందరిలో పొట్టులా రాలడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే, ఈ తీరుకి వంశపారంపర్యం దగ్గర్నుంచి ఎక్కువ వేడి లేదా చలి ప్రదేశంలో ఉండటం వరకు చాలా కారణాలు ఉంటాయంటున్నారు డాక్టర్ శైలజ. కాబట్టి, పొడి చర్మం ఉన్నవారు స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ తప్పక రాయాల్సిందే అని చెబుతున్నారు. అందులో సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే ఇంకా మంచిదంటున్నారు. ఎందుకంటే.. అది చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

చక్కటి పరిష్కారం : మీ ముఖం వెంటనే జిడ్డుగా తయారవుతోందా? - ఈ ఫేస్​ప్యాక్స్​తో తాజాగా మారిపోతుంది!

ఇకపోతే.. చాలా మంది మాయిశ్చరైజర్(Moisturizer)యూజ్ చేశాక సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటుంటారు. కానీ, అలా చేయొద్దని చెబుతున్నారు డాక్టర్ శైలజ. అందుకు బదులుగా మైల్డ్‌ క్లెన్సర్‌ని వాడాలని సూచిస్తున్నారు. అదేవిధంగా గుడ్డు తెల్లసొన, పెరుగు, చందనం, నిమ్మలతో చేసిన స్క్రబ్‌లను యూజ్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

అలాగే కొందరు డ్రై స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్​తో పాటు సన్​స్క్రీన్ వాడుతుంటారు. అలాంటి వారు జిడ్డు సమస్య బారినపడకుండా ఉండాలంటే జెల్‌ లేదా మ్యాట్‌ ఫినిష్‌ వంటి సన్​స్క్రీన్స్ ఎంచుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా మీరు వాడే ప్రొడక్ట్ ఏదైనా ఆలిగో పెప్టైడ్స్, బి5, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాంట్‌ బటర్, ఎసెన్షియల్‌ ఆయిల్స్, హైలురోనిక్‌ యాసిడ్‌ వంటివి అందులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణురాలు శైలజ.

ఇవి తప్పనిసరిగా పాటించాలి : జిడ్డు చర్మ సమస్య తగ్గించుకోవాలంటే పోషకాహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా డైలీ డైట్​లో తాజా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఫుడ్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే బాడీ హైడ్రేటెడ్​గా ఉండడానికి మాత్రమే కాదు.. చర్మ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి రోజూ తగినన్ని నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇలా డైలీ రొటిన్​లో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వర్షకాలంలో చర్మం జాగ్రత్త! ఈ ఇంటి చిట్కాలతో సౌందర్యం పెంచుకోండి!

ABOUT THE AUTHOR

...view details