viagra tablet side effects : అంగస్తంభన లోపం సమస్య ఉన్నవారికి సిల్డినాఫిల్ సిట్రేట్ (వయాగ్రా వంటివి) బాగా ఉపయోగపడుతుంది. ఫాస్ఫోడైస్టెరేజ్ టైప్ 5 (పీడీఈ5) ఇన్‌హిబిటార్స్ రకానికి చెందిన మందులు శృంగార భావన కలిగినప్పుడు అంగానికి అవసరమైన రక్త సరఫరా పుంజుకునేలా చేస్తుంది. అంగం గట్టిపడేలా, సంభోగం జరిపేలా సహకరిస్తుంది. కానీ చాలా మంది అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నా ఈ మందులు వాడడం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి స్తంభన లోపం లేకపోయినా కొందరు వినోదం కోసం ఈ మందులు వాడడం ఎక్కువవుతోంది. మరింత ఎక్కువసేపు అంగం స్తంభించటానికి, సామర్థ్యం గురించిన ఆందోళన, శీఘ్ర స్ఖలన సమస్య అధిగమించడం కోసం అనవసరంగా వాడుతుంటారు. కానీ, స్తంభన లోపం ఉన్న వారికి మాత్రమే వయాగ్రా మేలు చేస్తుంది. అనవసరంగా వాడి చిక్కులు తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు! - coriander health benefits
పీడీఈ5 ఇన్‌హిబిటార్స్ వయాగ్రా మందులు రక్తపోటును తగ్గించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని అప్పటికే రక్తపోటు తగ్గటానికి మందులు వాడే వారు వాడకూడదు. రెండు మందులు కలవడం వల్ల రసాయనిక చర్య జరిగి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఐడీఈ5 ఇన్‌హిబిటార్స్ మందులు ఛాతీనొప్పి తగ్గటానికి ఇచ్చే నైట్రోగ్లిజరిన్, రక్తపోటును తగ్గించే ఐసోసార్బయిడ్ వంటి మందులతో ప్రమాదకరంగా చర్య జరుపుతాయని తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సిల్డినాఫిల్ సిట్రేట్ వాడకంతో తలనొప్పి తప్పించి పెద్దగా దుష్ప్రభాలేవీ ఉండవు. కానీ కొందరిలో ఛాతీ మంట, ముఖం ఎర్రబడటం, కండరాల నొప్పులు, ముక్కు బిగుసుకోవటం, చూపు మారటం వంటి దుష్ప్రభావాలూ కనిపించే అవకాశాలున్నాయి. ఇలాంటివి చాలా అరుదే అయినా కొందరికి ఎక్కువసేపు అంగం గట్టిపడి అలాగే ఉండిపోవచ్చు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే అత్యసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.
కేవలం ఆత్మ విశ్వాసం పెరగటం కోసమే వయాగ్రా వంటి స్తంభన మాత్రలు తరచూ వాడితే మానసికంగా వాటిపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. మాత్రలు వేసుకోకపోతే సంభోగం జరపలేని స్థితి ఏర్పడితే భాగస్వాముల మధ్య వివాదాలకు దారితీయొచ్చని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.