Side Effects of Mehendi Using on Hair :సాధారణంగా వయసు పైబడే కొద్దీ జుట్టు నెరవడం, తెల్లగా మారడం సహజం. కానీ, ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో దానిని కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేస్తుంటారు కొందరు. ఇందుకోసం మెహందీ, డైలను యూజ్ చేస్తుంటారు. సాధారణంగా మెహందీని 'హెన్నా' అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. మీరు కూడా జుట్టుకు(Hair)హెన్నా యూజ్ చేస్తున్నారా? అయితే, ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. జుట్టుకు మెహందీని అప్లై చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ, ప్రత్యేకించి దానిని తరచుగా యూజ్ చేయడం, ఎక్కువ సేపు ఉంచడం వల్ల అది కొన్నిసార్లు హానికరంగా మారవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, జుట్టుకు హెన్నా యూజ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అలెర్జీ ప్రతిచర్యలు : మీరు జుట్టుకు మెహందీని అప్లై చేయడం వల్ల కొందరిలో అలెర్జీ ప్రతిచర్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఈ కారణంగా దురద, ఎరుపు, వాపు, నెత్తిమీద లేదా చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇది తీవ్రమైన సందర్భాల్లో కాంటాక్ట్ డెర్మటైటిస్‌కు దారితీయవచ్చంటున్నాు నిపుణులు. కాబట్టి, మీరు హెన్నాను యూజ్ చేసే ముందు అలాంటి సమస్యలకు గురికాకుండా ఉండాలంటే ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.
పొడి, పెళుసు జుట్టు :మీరు హెన్నాను తరచుగా ఉపయోగించినట్లయితే లేదా ఎక్కువ కాలం ఉంచినట్లయితే అది జుట్టు పొడిగా మారడానికి లేదా పెళుసుదనానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మెహెందీలోని డై మాలిక్యూల్స్ హెయిర్ షాఫ్ట్‌లోని కెరాటిన్‌కు కట్టుబడి సహజ నూనెలు, తేమను సమర్థవంతంగా తొలగిస్తాయి. ఫలితంగా జుట్టు గరుకుగా, గడ్డిలాగా, విరిగిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి, హెన్నాను యూజ్ చేసేటప్పుడు డీప్ కండిషనింగ్ లేదా ఆయిల్ ట్రీట్‌మెంట్‌లతో అనుసరించడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
2012లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హెన్నా తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా మారవచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నైజీరియాలోని 'లాగోస్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్' చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్. మోనికా మిస్తా హెన్నా తరచుగా యూజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పొడిగా, పెళుసుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రంగుపై ప్రభావం :మీరు తరచుగా హెన్నా యూజ్ చేయడం జుట్టు సహజ రంగుపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెహందీకి రంగు మార్చే గుణం ఉంటుంది. దీని కారణంగా మీ జుట్టు రంగు కోల్పోయి పాడైపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు హెన్నా యూజ్ చేసే ముందు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.