తెలంగాణ

telangana

ETV Bharat / health

డియర్ లేడీస్ మీ జుట్టు ఊడిపోయినా సరే - దీనితో స్టైలిష్​ హెయిర్​ స్టైల్​ సెట్​ చేసుకోవచ్చు! - ఈ కొత్త ట్రెండ్​ మీకు తెలుసా? - Stylish Scrunchie Bun Hair Style

Hair Styles: జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందన్నది పాత సామెత! కానీ.. కురులున్నా లేకున్నా కూడా.. ఈ స్క్రంచీ బన్స్‌తో ముడి పెట్టడం ఇప్పుడు కొత్త ట్రెండ్​. అసలు ఈ స్క్రంచీ బన్స్​ అంటే ఏమిటి? దీనిని ఎలా ధరించాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 5:20 PM IST

Hair Styles
Hair Styles (ETV Bharat)

Scrunchie Bun Hair Style:ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫ్యాషన్​ ఫాలో అవుతున్నారు. అకేషన్​కు తగ్గట్టుగా రెడీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాలి గోళ్లకు వేసుకునే నెయిల్​ పెయింట్​ నుంచి.. హెయిర్​ స్టైల్స్​ వరకు ప్రతి ఒక్కటీ ఫ్యాషన్​గా, ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. చూపు తిప్పుకోలేని విధంగా రెడీ అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకోసం కొద్దిమంది బ్యూటీపార్లర్​కు క్యూ కడితే.. మరికొద్దిమంది తమకు తెలిసిన టిప్స్​ ఫాలో అయ్యి అందంగా తయారవుతారు. అయితే.. అందంగా కనిపించడం అంటే కేవలం మంచి డిజైనర్​ శారీ కట్టి ముఖానికి మేకప్​ వేసుకోవడమే కాదు.. దానికి తగ్గ హెయిర్​ స్టైల్​ కూడా ఉండాలి. హెయిర్ స్టైల్స్‌తోనే మొత్తం లుక్ మారిపోతుంది.

హెయిర్​ స్టైల్స్​ విషయంలో అబ్బాయిలు ఎలా ఉన్నా.. అమ్మాయిలు మాత్రం అస్సలు కాంప్రమైజ్​ అవ్వరు. అకేషన్​కు తగిన విధంగా పోనీటెయిల్​​, ఫ్రెంచ్​ ఫ్లాట్.. అంటూ రకరకాల స్టైల్స్ ట్రై చేస్తుంటారు. అయితే.. ఏ హెయిర్​ స్టైల్​ ట్రై చేయాలన్నా పొడవైన, మందం కలిగిన జుట్టు కంపల్సరీ. కానీ.. ప్రజెంట్ చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. సరిపడా జుట్టు లేక అందంగా తయారవడం పై పెద్దగా ఇంట్రస్ట్​ చూపించడం లేదు. అయితే.. అలాంటి వారు ఇప్పుడు ఏ టెన్షన్​ లేకుండా నచ్చిన విధంగా జడ వేసుకోవచ్చు. జుట్టే లేదంటే స్టైలిష్​ జడ ఎలా వేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ ఆలోచనకు పరిష్కారంగా ప్రస్తుతం మార్కెట్​లో స్క్రంచీ బన్స్​ లభిస్తున్నాయి. ఈ బన్​.. పెట్టుకున్నవారికి స్టైలిష్‌ లుక్‌ని తెచ్చిపెడుతుంది.

మీకు కర్లీ హెయిర్ అంటే ఇష్టమా? - పార్లర్​కు వెళ్లకుండానే మీ జుట్టును మార్చేయండి! - Tips for Straight Hair to Curly

స్క్రంచీ అనేది జుట్టుని ముడివేసే క్లాత్‌ రబ్బర్‌ బ్యాండ్‌. ఇది పోనీటైల్‌ చుట్టూ రఫుల్‌ డిజైన్‌లా కనిపిస్తుంది. ఆ డిజైన్‌ ఆధారంగానే అచ్చంగా జుట్టుతోనే రకరకాల డిజైన్లలో బన్‌లను తయారు చేస్తున్నారు. వీటిని పోనీటెయిల్, జడ, ముడి.. దేనిమీదకైనా ఎంచుకోవచ్చు. ఎలాస్టిక్‌ బ్యాండ్‌ సాయంతో తయారైన ఈ బన్‌లను సులువుగా జడకి లేదా ముడికి చుట్టేసుకోవచ్చు. కొన్ని క్లచ్, క్లిప్‌ల సాయంతోనూ తయారవుతున్నాయి. కాబట్టి మన సౌకర్యానికి తగ్గట్లు ఎంచుకోవచ్చు.

సెలబ్రిటీలు వేసుకునే హాఫ్‌ బన్‌ హెయిర్‌ స్టైల్, లేదా సౌకర్యంగా ఉండే సింపుల్‌ నాట్, అదీ కాదంటే వెడ్డింగ్‌ లుక్‌...ఇలా సందర్భానికి తగ్గట్లు మనకు నచ్చిన బన్‌ని ప్రయత్నించొచ్చు. ఫ్యాషన్‌ కోసం పూర్తి భిన్నమైనవీ ఎంపిక చేసుకోవచ్చు. ఇంకాస్త.. ఆధునికతను కోరుకునేవారి కోసం కలర్‌ స్ట్రీకింగ్‌ చేసినవీ, రకరకాల రంగుల్లో డై చేసినవీ దొరుకుతున్నాయి. ఉంగరాల జుట్టు, సాఫ్ట్‌ హెయిర్‌.. నప్పుతుందో లేదో అన్న బెంగ కూడా అసలే అక్కర్లేదు. మీ శిరోజాల తత్వానికి దగ్గరగా ఉండే రకాల్నీ ఎంచుకోవచ్చు. పార్టీ అయినా, ఫంక్షన్‌ అయినా... నచ్చిన కొప్పు పెట్టుకుని అందరి ప్రశంసలూ అందుకోవడమే తరవాయి. మరి మీరు కూడా వీటిని ఓసారి ట్రై చేయండి..

జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా! - Best Oils for Double Hair Growth

జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్​! - Onion Oil Benefits

ABOUT THE AUTHOR

...view details