Restless Legs Syndrome Symptoms : కొందరు తరచూ తమ కాళ్ల(Legs)ను కదుపుతుంటారు. కాసేపు కూర్చోగానే పైకి లేవాలన్న కోరిక వారికి కలుగుతుంది. ఒకవేళ వారు అలా కాళ్లు కదపకుండా బలవంతంగా దాన్ని నియంత్రించుకున్నా.. కొంత సమయం తర్వాత వారి ప్రమేయం లేకుండానే మళ్లీ కాళ్లను కదిలించడం స్టార్ట్ చేస్తారు. ఆఖరికి నిద్రించే సమయంలో కూడా లెగ్స్ కదిలించాలన్న కోరిక వాళ్లలో కలుగుతుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుంటే అది 'రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్' వ్యాధి కావొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు, చికిత్స విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే..
దీనిని ఒక నాడీ వ్యవస్థ రుగ్మతగా చెప్పుకోవచ్చు. ఇది మీ కాళ్లను ఎప్పుడూ కదిలించాలనే కోరికను కలిగిస్తుంది. ఇది ఎక్కువగా రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అందుకే దీనిని తరచుగా నిద్రకు ఆటంకం కలిగించే రుగ్మతగా పరిగణిస్తారు నిపుణులు. ఇక ఆర్ఎల్ఎస్ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మరింత తీవ్రంగా మారుతుంది. ఈ సిండ్రోమ్ ఎంత ఎక్కువగా ఉంటే.. నిద్రకు అంత ఎక్కువగా అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇది వారి రోజువారీ జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. కుటుంబ చరిత్రలో ఈ ప్రాబ్లమ్ ఉన్నవారి పిల్లల్లో చాలా మందిలో రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంశపారంపర్యంగా కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
ఆర్ఎల్ఎస్ లక్షణాలు..
- రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ ప్రధాన లక్షణం కాళ్లను కదిలించాలనే అనియంత్రిత కోరిక.
- కాళ్లలో అసౌకర్యం, జలదరింపు, లాగడం, నొప్పి, పురుగులు పాకుతున్నట్లు అనిపించడం.
- రాత్రిపూట కాళ్లను కదిలించాలనే భావన మరీ ఎక్కువగా ఉండడం
- కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి చేతులు కూడా కుదుపునకు గురవుతాయి.
- నిద్రలేమి.
- లక్షణాలు కొందరిలో ఎక్కువగా.. మరికొందరిలో అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి.