Reheated Tea Side Effects In Telugu : టీ/చాయ్- మన దేశంలోని చాలా మంది ప్రజలకు ఒక కామన్ ఎమోషన్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక మంది కనీసం రెండు మూడు సార్లు టీ తాగుతుంటారు. కొంతమందికైతే టీ లేనిదే అసలు రోజు గడవదు, ఏ పని సక్రమంగా కూడా చేయలేరు! అంతలా అలవాటు పడ్డారు మనవాళ్లు. అయితే బయట షాపుల్లో, ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా తాగే టీ కొన్నిసార్లు మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే?
సాధారణంగా కొందరు ఎప్పుడు టీ తాగాలనిపిస్తే అప్పుడే తయారు చేసుకుని తాగుతారు. మరికొందరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బయటకు వెళ్లి మరీ తాగుతారు. ఇంకొందరు మాత్రం ఒకేసారి ఎక్కువ టీ తయారు చేసి పక్కన పెట్టుకుంటారు. దాన్ని కొన్ని గంటల పాటు అలా వదిలేసి మళ్లీ మళ్లీ మరగబెట్టుకుని సేవిస్తుంటారు. అలా చేస్తే ఆరోగ్యానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణాలను కూడా వివరిస్తున్నారు.
1. బ్యాక్టీరియా :
టీని అలా చాలా సమయం వదిలేస్తే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే మళ్లీ మళ్లీ వేడి చేసుకుని టీని తాగకూడదు.