తెలంగాణ

telangana

ETV Bharat / health

రక్తహీనత నుంచి షుగర్‌ కంట్రోల్‌ వరకు- పచ్చి మామిడికాయతో అన్నీ ఆరోగ్య ప్రయోజనాలే! - Raw Mango Health Benefits in telugu

Raw Mango Health Benefits : మామిడిని పండ్లలో రారాజు అంటారు. వేసవిలో ఇవి చాలా ఫేమస్​. చాలా మంది వీటిని పచ్చిగా, పండిన తర్వాత తింటుంటారు. మరి మీకు కూడా పచ్చిమామిడి కాయలు అంటే ఇష్టమా? ఎండాకాలంలో రోజూ తింటుంటారా? అయితే, మీ శరీరంలో జరిగే మార్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి..

Raw Mango Health Benefits
Raw Mango Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 4:08 PM IST

Raw Mango Health Benefits : ఎండాకాలం అనగానే మనందరికీ నోరూరించే మామిడిపండ్లు కళ్లముందు మెదులుతుంటాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతో పాటు, తియ్యగా ఉండటం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడిని 'పండ్లలో రారాజు' అని పిలుస్తారు. అయితే, ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇక సీజన్‌ ప్రారంభంలో ఎక్కువగా పచ్చిమామిడి కాయలు లభిస్తాయి. దీంతో చాలా మంది పచ్చడి తయారు చేసుకుంటారు. మరి కొంతమంది పచ్చికాయలను కోసి ఆ ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తింటుంటారు. మరి మీరు కూడా అదే రకానికి చెందిన వారైతే రోజూ పచ్చి మామిడికాయలు తింటే శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసుకోండి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది :పచ్చి మామిడికాయలో విటమిన్‌ ఇ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయి. పచ్చి మామిడిలోని విటమిన్‌ సి వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులంటున్నారు.

రక్తహీనతను తగ్గిస్తుంది :పచ్చి మామిడికాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందట. అలాగే శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఆపుతుందని, హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరగడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. 2017లో "Journal of Nutrition and Metabolism" లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజూ మీడియం సైజులో ఉన్న పచ్చి మామిడి కాయను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయని పరిశోధకులు వెల్లడించారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది : పచ్చి మామిడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది :పచ్చి మామిడిలో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా, మొటిమలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో :పచ్చి మామిడి కాయలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే మధుమేహం ఉన్న వారు పచ్చి మామిడి కాయను డాక్టర్‌ సూచనల మేరకు తినవచ్చని సూచిస్తున్నారు.

ఇంకా :

  • ఇందులో తక్కువ క్యాలరీలు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల వెయిట్‌ లాస్‌ అవ్వచ్చు. అలాగే పచ్చి మామిడికాయను తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించి ఎక్కువగా తినకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
  • పచ్చి మామిడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
  • అలాగే పచ్చి మామిడిలో ఎక్కువగా ఉండే కెరోటినాయిడ్స్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది.
  • చిగుళ్ల నుంచి రక్తస్రావం అయ్యే వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
  • పచ్చి మామిడిలోని హైడ్రేటింగ్ లక్షణాలు డీహైడ్రేషన్‌ను నివారించడంలో ప్రభావవంతంగా చేస్తాయని అంటున్నారు.
  • పచ్చి మామిడి కాయను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ, వీటిని అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పచ్చి మామిడి కాయలను డాక్టర్ల సలహా మేరకే తినాలని సూచిస్తున్నారు.

రోజూ ఉడికించిన గుడ్డు తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మిమ్నల్ని తరచుగా కడుపు నొప్పి బాధిస్తోందా? - ఈ టిప్స్​తో అంతా సెట్​!

సమ్మర్​ స్పెషల్​ రాగి జావ - ఇలా చేస్తే వద్దన్నోళ్లు కూడా రెండు గ్లాసులు తాగడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details