తెలంగాణ

telangana

ETV Bharat / health

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో మొటిమలు మాయం - ఇందులో నిజమెంత? - Omega 3 Fatty Acids For Pimples

Omega 3 Fatty Acids For Pimples : మొటిమలు తగ్గడానికి ఎవరో ఏవో చెప్పారని చాలా చిట్కాలు ప్రయత్నించి ఉంటారు. మొటిమలను తగ్గించేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉపయోగపడతాయట. అదేలానో ఈ స్టోరీలో చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 2:13 PM IST

Omega 3 Fatty Acids For Pimples
Omega 3 Fatty Acids For Pimples (Getty Images)

Omega 3 Fatty Acids For Pimples : మనం తీసుకునే ఆహారం చర్మంపై మొటిమలు రావడానికి కారణమవుతుందన్నది దాదాపు అందరికీ తెలుసు. అల్ట్రా ప్రోసెస్‌డ్ ఫుడ్స్ అయిన రిఫైన్డ్ షుగర్స్, డెయిరీ ప్రొడక్ట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి సెబమ్, కెరాటిన్‌లు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న వెంట్రుకల కుదుళ్లలో బ్యాక్టీరియా పేరుకొని మొటిమలు రావడానికి కారణమవుతాయి. కచ్చితంగా ఆహారం కారణంగానే మొటిమలు వస్తాయనడానికి పూర్తి ఆధారాలు లేవు. కానీ వాటిని తగ్గించే క్రమంలో ఆహార నియమాలు మంచి ఫలితాలు చూపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో 26 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న 60 మంది వ్యక్తులు పాల్గొన్నారు. నాలుగు నెలల పాటు జరిగిన ఈ పరిశోధనల్లో మొదటి ఎనిమిది వారాలు 600 ఎమ్​జీ డీహెచ్​ఏ/300 ఎమ్​జీ ఈపీఏను, తర్వాత ఎనిమిది వారాల పాటు 800 ఎమ్​జీ డీహెచ్​ఏ/400 ఎమ్​జీ ఈపీఏ ఉన్న నోటి సప్లిమెంట్లను వారికి అందించారు. ఆ తర్వాత వారిలోని రక్త నమూనాల్లో ఈపీఏ, డీహెచ్​ఏ, ఏఎల్​ఏ స్థాయిలను సేకరించారు. దాంతో పాటుగా హెచ్ఎస్ ఒమేగా-3 ఇండెక్స్‌ను నమోదు చేసుకున్నారు.

తగు పరిమాణంలో తీసుకోవాలి
మొటిమలు ఎక్కువగా కనిపించిన వారిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపమున్నట్లు గుర్తించారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అయిన ఐకోసపెంటేనోయిక్ యాసిడ్ (EPA), డొకొసాహెక్సేనిక్ యాసిడ్ (DHA)లు ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఇన్ఫమ్మేటరీ యాక్టివిటీ ఎక్కువగా నమోదవుతుంది. అయితే వీటిని తగు పరిమాణంలో మాత్రమే తీసుకుంటే మొటిమలు రాకుండా ఉంటుందని రుజువైంది. జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర వహించే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఫ్యాటీ యాసిడ్ మానవ శరీరంలో అంతర్గతంగా ఉత్పత్తి అవ్వదు. అందుకే చక్కటి ఆరోగ్యానికి దోహదపడే ఈపీఏ, డీహెచ్​ఏ, ఏఎల్​ఏను ఎప్పటికప్పుడు తగిన పరిమాణంలో తీసుకోవాలి.

ఇటీవలి కాలంలో మనకు అందుబాటులో ఉంటున్న ఫాస్ట్ ఫుడ్స్​లో ఎక్కువగా యాంటీ ఇన్ఫమ్మేటరీ గుణాలే ఉంటున్నాయని గుర్తించినట్లు పలు అధ్యయనాలు తెలిపాయి. పాలు, వేపుళ్లు, చిప్స్ తినే వారిలో ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ఇవి కాకుండా పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకునే వారిలో ఇన్పమ్మేటరీ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. వీరు ఎక్కువగా ఆరోగ్యంగా కనిపించారు. ఈ స్టడీ తర్వాత మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేదా సహజంగా దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ను ఆహారం తీసుకున్న వారిలో మొటిమలు తక్కువగా వచ్చినట్లు గుర్తించారు.

గుమ్మడికాయ ఫేస్ మాస్క్​తో మీ ఫేస్​లో ఫుల్ గ్లో- ఎలా తయారు చేయాలో తెలుసా? - Pumpkin Face Mask DIY

మొటిమలు, మచ్చలు తగ్గట్లేదా? ఈ ఔషధం వాడితే చాలు - మీ ముఖం తలతలా మెరవడం ఖాయం! - Ginger Lime Scrub Benefits

ABOUT THE AUTHOR

...view details