తెలంగాణ

telangana

ETV Bharat / health

పాలలో ఈ పొడి కలిపితే చాలు- రాత్రంతా మత్తుగా నిద్రపోవచ్చట! - Benefits Of Nutmeg Powder In Milk - BENEFITS OF NUTMEG POWDER IN MILK

Nutmeg Milk For Sleep Benefits In Telugu : రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపోవచ్చని మనకు తెలుసు. అదే పాలలో చిటికెడు జాజికాయ పొడిని జోడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? జాజికాయ పాలను రోజూ తాగడం వల్ల ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకోసం.

Nutmeg Milk For Sleep Benefits In Telugu
Nutmeg Milk For Sleep Benefits In Telugu

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 4:54 PM IST

Updated : Apr 24, 2024, 5:17 PM IST

Nutmeg Milk For Sleep Benefits In Telugu : ప్రశాంతంగా నిద్రపోవాలన్నా అదృష్టం ఉండాలట! ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఆరోగ్య సమస్యలు అయిండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు, లేక ఏవేనా ఆలోచనలు అయిండొచ్చు కారణాలేవైనా పదిలో దాదాపు ఏడుగురు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారట. హాయిగా నిద్రపోయేందుకు రకరకాల థెరపీలు, వ్యాయామాలు చేసేవారు కొందరైతే, కళ్లు మూసుకుని, కాళ్లు ముడుచుకుని కసరత్తులు చేసేవారు ఇంకొందరు ఉన్నారు. అయితే అలాంటి వారికి జాజికాయ పొడి చాలా బాగా పనిచేస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

రోజూ రాత్రి నిద్రపొయే ముందు గ్లాసు పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపోవచ్చని మనందరికీ తెలుసు. అయితే అదే పాలలో కాస్త జాజికాయ పొడిని వేసుకుంటే నిద్ర విషయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని మీకు తెలుసా? ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు పడుకునే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడి వేసుకుని తాగడం వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి మెదడుకు చాలా ఉపశమనం కలుగుతుందట. ఫలితంగా మీరు తెల్లవారేదాకా హాయిగా డీప్ స్లీప్​లోకి వెళ్లొచ్చట. అంతేకాదు జాజికాయ పొడి మీరు తాగే పాలకు మరింత తీపిదనాన్ని, అద్భుతమైన రుచిని అందిస్తుంది. వంటగదిలో ఉండే ఈ మసాలా దినుసు చేసే మరిన్ని మ్యాజిక్ లేంటో వివరంగా తెలుసుకుందాం రండి.

జాజికాయ పొడి నిద్రకు ఎలా దోహదపడుతుంది?
జాజికాయ పొడి మెదడును చాలా ప్రశాంతంగా మార్చి హాయిగా నిద్రపోయేలా చేస్తుందని ఈ మధ్య చేసిన చాలా అధ్యయనాల్లో తెలిసింది. ఇందులో మాంగనీస్, కాపర్, మోగ్నీషియం, విటమిన్-బీ6 వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు, మెండుగా దొరుకుతాయి. ముఖ్యంగా ఇందులో మిరిస్టిసిన్, ఎలిమిసిన్ అనే బయోఆక్టివ్ భాగాలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయట. నిద్రపోయేందుకు సహాయపడే న్యూరోట్రాన్సిమిటర్ల ఉత్పత్తి, నియంత్రణ విషయంలో ఈ పోషకాలు చాలా అవసరమట. ఇవి మెదడులోని న్యూరోట్రాన్సిమిటర్ల చర్యను సవరించి, గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్ (GABA) గ్రాహకాలుగా పనిచేస్తాయి. GABA అనేది మీ మెదడు నరాలకు విశ్రాంతినిచ్చి, మీరు మరింత హాయిగా నిద్రపోయేందుకు సహాయపడే న్యూరోట్రాన్సిమిటర్.

మరిన్ని లాభాలేంటి?
రోజూ రాత్రి జాజికాయ పాలు తాగడం వల్ల మెదడులో GABA స్థాయిలు పెరుగుతాయని అధ్యయనాల్లో నిరూపితమైంది. అలాగే ఆందోళన తగ్గి మెదడు చాలా తేలిక అవుతుంది. ఇందులోని పోషకాలు నిద్రలేమి సమస్యలతో పాటు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలను కూడా నయం చేసే శక్తిని కలిగి ఉంటాయట. జాజికాయ పొడి జీర్ణ సమస్యలను కూడా దరిచేరకుండా చేస్తుందట. రాత్రిపూట భోజనం తర్వాత కనీసం అరగంట తర్వాత, పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చటి పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగితే మీరు హాయిగా మత్తుగా నిద్రపోవచ్చు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేసవిలో జలుబును తగ్గించుకోవడం ఎలా? మీకోసం 5 సింపుల్ టిప్స్! - Summer Cold Remedies

సమ్మర్​ వచ్చేసింది- మామిడిపండ్లను ఎలా తింటున్నారు? ఇలా తింటే ఎన్ని లాభాలో! - Soak Mangoes Before Eating

Last Updated : Apr 24, 2024, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details