Night Shift Health Care In Telugu : ప్రస్తుత సాంకేతిక యుగంలో చాలా మంది నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. నైట్ షిఫ్ట్ చేసినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసా?
మన శరీరం కూడా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడింది. కానీ, ప్రస్తుత కాలంలో కొందరు ఉద్యోగులు నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సూర్యోదయంతోపాటు పగటిపూట వెలుగుకి దూరంగా ఉంటున్నారు. దీంతో శరీరానికి సహజంగా అందాల్సిన డీ విటమిన్ అందట్లేదు. మరికొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. మరి నైట్ షిఫ్ట్‌లో పనిచేసినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్, మీడియా, ఫార్మా వంటి రంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువగా నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రపంచ దేశాల్లో కంపెనీ పనివేళల తగ్గట్లు నైట్ షిఫ్ట్‌లు చేయాలి. దీనివల్ల డయాబెటిస్‌తోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతున్నారు. చిన్నవయసులోనే అనారోగ్యంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు. కార్పొరేట్ సంస్కృతి కారణంగా ఆహార అలవాట్లలోనూ మార్పులు రావడం వల్ల మరికొన్ని ఇతర సమస్యలు తోడవున్నాయి.
సహజంగా శరీరం రాత్రిపూట పలు మార్పులకు లోనవుతుంది. రాత్రి పూట విశ్రాంతి లేకపోవడం వల్ల ఫిట్‌నెస్ కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటివారి కోసం బాలీవుడ్ హీరోయన్లు కరీనా కపూర్, అలియా భట్, కంగనా రనౌత్ వంటివారికి డైటీషియన్‌గా పనిచేసిన రజుతా దివేకర్ కొన్ని సూచనలు చేశారు. నైట్‌షిఫ్ట్ ఉద్యోగుల తీసుకోవాల్సిన డైట్‌తో పాటు ఇతర సూచనలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు.