Natural Ways To Keep Mosquitoes Away : మామూలు రోజుల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. వీటివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర రోగాలు వస్తాయి. అందుకే.. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వాడుతుంటారు. అయితే.. వీటి వల్ల దోమలు చనిపోతాయేమో గానీ.. మన ఆరోగ్యం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే.. దోమలను నేచురల్‌గా తరిమికొట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కర్పూరంతో :
మనందరి ఇళ్లలో దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడుతుంటాం. దీని ద్వారా దోమలను ఈజీగా తరిమికొట్టవచ్చని మీకు తెలుసా ? అదేలా అంటే.. రాత్రి అవ్వగానే ఇంట్లో ఓ చిన్నప్లేటులో కర్పూరాన్ని తీసుకొని అరగంటసేపు ఓ మూలన పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!
వెల్లుల్లి ఘాటు వాసనకు పరార్ :
వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాదు.. దోమలను కూడా తరిమికొడుతుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించండి. తర్వాత ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసుకుని.. రాత్రి ఇంట్లో స్ప్రే చేయండి. ఇలా చేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
లావెండర్ నూనెతో :
దోమలకు లావెండర్ నూనె అస్సలు నచ్చదు. ఈ వాసన ఉన్నచోట నుంచి అవి పారిపోతాయి. కాబట్టి, ఇంట్లో లావెండర్ నూనె స్ప్రే చేయండి. దోమలు మరీ ఎక్కువగా ఉంటే.. లావెండర్ ఆయిల్‌ని చేతులు, కాళ్లకు రాసుకోండి. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదు.