Natural Oils For Hair Growth :జుట్టు అనేది ఉంటే ఏ కొప్పు (హెయిర్ స్టైల్) అయినా పెట్టుకోవచ్చు అన్నట్లు ముందు జుట్టే కదా ఇంపార్టెంట్. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైపైన షైనింగ్ వచ్చేలా ఏవో ఒక క్రీములు వాడేస్తే సరిపోదు. వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా ఉంటేనే కేశారోగ్యం మెరుగవుతుంది. ఇది కేవలం చక్కటి నాణ్యమైన నూనెతో రోజూ మసాజ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. జుట్టు ఒత్తుగా, డాండ్రఫ్ రహితంగా ఉంచే ఆ నూనెలేంటో తెలుసుకుందాం.
రోజ్‌మేరీ ఆయిల్
జుట్టు ఒత్తుగా కనిపించాలని మీరు అనుకుంటే మీకు కరెక్ట్ ఛాయీస్ రోజ్‌మేరీ ఆయిల్. కణాల ఉత్పత్తిని మెరుగుచేసేందుకు బాగా సహాయపడుతుంది.
లావెండర్ ఆయిల్
జుట్టు త్వరగా ఎదగడంలో లావెండర్ ఆయిల్ బాగా తోడ్పడుతుంది. కణాల ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబయాల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలతో కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పుదీనా నూనె
ఈ నూనె మనకు తలలో చల్లని ఫీలింగ్‌ను కలిగిస్తుంది. రోజూ రాసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల రక్త సరఫరా బాగా జరిగి వెంట్రుకలు బాగా ఎదిగేందుకు సహాయపడుతుంది.
లెమన్‌గ్రాస్ ఆయిల్
డాండ్రాఫ్ను తగ్గించి, జుట్టు పొడుగ్గా ఎదిగేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక బెస్ట్ ఆప్షన్. కుదుళ్లలో జిడ్డును తగ్గించి జుట్టు ఒత్తుగా ఎదిగేందుకు సహాయపడుతుంది.