Microwave Oven Cleaning Tips: మైక్రోవేవ్ ఓవెన్‌ని పట్టణాలు, నగరాల్లో చాలా మంది వాడుతుంటారు. ఆహారాన్ని క్షణాల్లోనే వేడివేడిగా ప్రిపేర్ చేస్తుండడం వల్ల దీని వాడకం పెరిగిపోయింది. వంట సమయాన్ని తగ్గించి.. సగం శ్రమని దూరం చేస్తుంది. అందుకే, దీనిని చాలా మంది యూజ్ చేస్తున్నారు. అయితే యూజ్ చేయడం అందరూ చేస్తున్నారుగానీ.. దాన్ని సరిగా క్లీనింగ్ మాత్రం చేయట్లేదు. దీంతో లోపల క్రిములు చేరి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అందుకే కొన్ని టిప్స్ అందిస్తున్నారు. వాటిపై ఓ లుక్కేయండి.
లోపలి భాగాన్ని ఇలా శుభ్రపరచడం:మైక్రోవేవ్ ఓవెన్‌లోని సేఫ్ బౌల్‌లో ఒక కప్పు నీరు, కొద్దిగా నిమ్మరసం కలపండి. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి మైక్రోవేవ్‌లో ఉంచి హై పవర్ మీద 5 నిమిషాలు వేడి చేయాలి. చల్లారిన తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ ఓపెన్ చేసి.. ఆ బౌల్ బయటికి తీసి మైక్రోఫైబర్ క్లాత్ సాయంతో సున్నితంగా తుడవండి.
వాషింగ్ మెషిన్ ఇలా క్లీన్ చేస్తే - ఎక్కువ కాలం పనిచేస్తుంది!
తలుపులు:మైక్రోవేవ్ ఓవెన్‌ను శుభ్రపరిచేటప్పుడు.. దాని డోర్ కూడా క్లీన్ చేయాలి. తలుపుల అంచులతో సహా అన్ని ప్రాంతాలనూ నీరు ,బేకింగ్ సోడా మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు. అందుకోసం కప్పు బౌల్‌లో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఓ మెత్తని క్లాత్ సాయంతో శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా ప్లేస్‌లో వెనిగర్ కూడా యూజ్ చేయవచ్చు.
ఆహార పదార్థాలు:ఆహార పదార్థాలు టర్న్ టేబుల్ ప్రాంతంలో ఇరుక్కుపోతే.. వాటిని బేకింగ్ సోడా, నీటితో కలిపి శుభ్రం చేయవచ్చు. తర్వాత మెత్తని క్లాత్‌తో తుడిచి.. కొద్దిసేపు ఆరనివ్వాలి.
స్మెల్ రాకుండా:నెలల తరబడి ఓవెన్ క్లీన్ చేయకపోతే విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలారాకుండా ఉండాలంటే క్లీన్ చేసే ముందు.. ఓ బౌల్‌లో వేడినీరు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలిపి దానిని ఓవెన్లో ఉంచి ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత బౌల్‌ను బయటికి తీసి పొడి క్లాత్‌తో శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల అది క్లీన్‌గా ఉండటమే కాకుండా మంచి వాసన వస్తుంది.
ఓవెన్ ఎన్నిరోజులకొకసారి శుభ్రం చేయాలి:మైక్రోవేవ్ ఓవెన్‌ని కనీసం వారానికి ఒక్కసారైనా పూర్తిగా శుభ్రం చేయాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఓవెన్ లోపలి భాగంలో అనుకూలమైన వాతావరణం కారణంగా వైరస్, బ్యాక్టీరియా పెరుగుతాయంటున్నారు. కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్‌ను వారానికి ఒకసారి క్లీన్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
ఐరన్ దోశ పెనం త్వరగా తుప్పు పడుతోందా? - ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్యే ఉండదు!
ఇతర జాగ్రత్తలు:
- ఆహార పదార్థాలను వేడి చేసిన ప్రతిసారి మైక్రోవేవ్ ఓవెన్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఓ పొడి క్లాత్ తీసుకుని తేమ మొత్తం తుడిచిన తర్వాత డోర్‌ను 5 నిమిషాలు తెరిచే ఉంచాలి.
- మైక్రోవేవ్‌ను క్లీన్ చేసే సమయంలో మెత్తని క్లాత్ ఉపయోగించాలి. గరుకుగా ఉండే స్కబ్రర్ అలాగే ఎనామిల్‌ను దెబ్బతీసే ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
- మైక్రోవేవ్‌లో గ్రిల్ ఉంటే ఇంటిరీయర్ క్లీనింగ్ కష్టంగా ఉంటుంది. అయితే.. కొన్ని ఓవెన్లలో గ్రిల్ తీయడానికి వీలుంటుంది.
- మైక్రేవేవ్ను శుభ్రం చేసిన ప్రతిసారీ టర్న్ టేబుల్ని లోపలి నుంచి తీసి డిష్వాషర్తో క్లీన్ చేయాలి.
- అయితే క్లీన్ చేసే ముందు మాన్యువల్‌ను క్లియర్‌గా చదవాలి.
మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే స్మెల్ పరార్!
గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!