తెలంగాణ

telangana

ETV Bharat / health

రక్తపోటు తక్కువగా ఉంటే ఏమవుతుంది? - నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా? - Is Low Blood Pressure Good Sign - IS LOW BLOOD PRESSURE GOOD SIGN

Is Low Blood Pressure Good Sign? : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్యల్లో రక్తపోటు ఒకటి. అయితే.. చాలా మందికి అధిక రక్తపోటు తీవ్రత గురించి మాత్రమే తెలుసు. మరి.. లో-బీపీ సంగతేంటి? అది ప్రమాదకరమేనా? అనే ప్రశ్నకు నిపుణులు ఇలా సమాధానం చెపుతున్నారు.

Low BP Precautions
Is Low Blood Pressure Good Sign (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 18, 2024, 9:52 AM IST

Updated : Sep 18, 2024, 1:36 PM IST

Is Low Blood Pressure Good Sign? : హైబీపీని అందరూ ప్రమాదకారిగా భావిస్తారు. గుండెపోటు నుంచి పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అన్నింటికీ ఒక కారణంగా చెబుతారు. ఈ క్రమంలో.. రక్తపోటు తక్కువగా ఉండడం మంచిదని చాలా మంది నమ్ముతారు. మరి.. బీపీ తక్కువగా ఉండడం మంచిదేనా అంటే.. కానేకాదు అంటున్నారు నిపుణులు. హై-బీపీ మాదిరిగానే.. లో-బీపీ కూడా ప్రమాదకరమే అంటున్నారు. ఇంతకీ.. లో బీపీ ఎందుకొస్తుంది? రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? బీపీ అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా అయితే బీపీ 120/80 mmHg ఉండటం మంచిది. కానీ.. అంతకంటే ఎక్కువగా ఉంటే హై బీపీ(హైపర్ టెన్షన్) అంటారు. అలాగే.. అంతకంటే తక్కువగా ఉంటే లో-బీపీ(హైపో టెన్షన్)గా చెబుతారు. కాకపోతే.. వైద్యపరంగా మాత్రం 90/60 mmHg అంతకంటే తక్కువగా ఉంటేనే లో-బీపీగా పరిగణిస్తుంటామని చెబుతున్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ డి. ప్రమోద్ కుమార్.

లో-బీపీ ఎందుకొస్తుంది? కారణాలేంటి?

లో బీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ ప్రమోద్ కుమార్. ముఖ్యంగా ఏదైనా గుండె సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు లో బ్లడ్ ప్రెజర్ ప్రాబ్లమ్ తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అలాగే.. ప్రెగ్నెన్సీ టైమ్​లో కూడా లో బీపీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందట. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలోనూ హార్మోన్స్ ఇన్​బ్యాలెన్స్ వల్ల కూడా లో బీపీ వస్తోందని సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు కూడా ఈ సమస్య తలెచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

ఇవేకాకుండా.. డీహైడ్రేషన్ అధికంగా అయినప్పుడు, యాక్సిడెంట్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు రక్త పరిమాణం తగ్గిపోయి లో-బీపీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందట. ఇవేకాకుండా.. కొన్ని మందులు అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా వాడినప్పుడూ బీపీ నార్మల్​గా ఉన్నా ఒక్కోసారి రక్తపోటు పడిపోయి 'లో బీపీ' వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

లో బీపీ ఎప్పుడు ప్రమాదం?

రక్తపోటు తగ్గడం మూలంగా.. తలనొప్పి, మైకం, వికారం, చూపు మబ్బుగా కనపడటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు. అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన ట్రీట్​మెంట్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • లో బీపీ రాకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు.
  • ముఖ్యంగా డైలీ సరైన పోషకాహరం తీసుకునేలా చూసుకోవాలి. అదేవిధంగా ఉప్పు మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. రోజూ తగినంత వాటర్ తాగేలా చూసుకోవాలి.
  • ఆల్కహాల్, కెఫెన్ ఉండే పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
  • రెగ్యులర్​గా వ్యాయామం, యోగా వంటి వాటిని సాధన చేస్తుండాలి.
  • ఇక చివరగా రక్తపోటు తగ్గినట్టు అనిపిస్తే.. వెంటనే డాక్టర్​ను కలిసి, తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిదని డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

క్లారిటీ: బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? - తగ్గడానికి ఏం చేయాలి? - నిపుణుల ఆన్సర్ ఇదే!

హై బీపీతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్​ ఐటెమ్స్​కు దూరంగా ఉండాల్సిందే!

Last Updated : Sep 18, 2024, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details