Diet Plan for Weight Loss : శరీర బరువు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. వయస్సు, ఎత్తుకు తగ్గట్లుగా శరీర బరువును అదుపులో ఉంచగలిగితే అనారోగ్యం దరిచేరదని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన శైలి వల్ల చాలా మందిలో అధిక బరువు సమస్య కనిపిస్తోంది. బరువు తగ్గడానికి వారు చేయని ప్రయత్నాలంటూ లేవు. అధిక బరువు కారణంగా అనేక రుగ్మతలు శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. మధుమేహం లాంటి జబ్బులు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీర బరువును తగ్గించుకునేందుకు ఆహార ప్రణాళిక అవసరం.
ఉదయం టిఫిన్ మొదలుకుని మధ్నాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంలో తీసుకునే పదార్థాలను సరైనవి ఎంచుకుంటే బరువును అదుపులో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. అధిక వ్యాయామం అవసరం లేకుండానే బరువు తగ్గే అవకాశాలు భోజనంలోనే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి భోజనానికి మధ్య తీసుకునే స్నాక్స్ అధిక ప్రభావం చూపే వీలుంది. మాంసకృత్తులు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన స్నాక్స్ తీసుకుంటే మంచిదని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు. చిరుతిండి విషయంలో వేరుశనగలు, తామర గింజలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. పైగా తక్కువ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ శక్తినిస్తాయి. శరీర బరువు తగ్గడంలో సహాయపడే వేరుశనగ, తామర గింజల్లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా?
కాల్చిన శనగలతో గుండెపోటుకు చెక్- ఆ వ్యాధి ఉన్నోళ్లకు డేంజర్! - ROASTED CHANA BENIFITS
వేరుశనగ (peanut)
మార్కెట్లో తామర గింజలతో పోలిస్తే వేరుశనగ తక్కువ ధరకు దొరుకుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఈ లక్షణం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వేరుశనగను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఆకలిని నియంత్రించవచ్చని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పల్లీలు జీవక్రియ రేటును పెంచడంతో పాటు మలబద్ధకం, దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. 100 గ్రాముల వేరుశనగల్లో 567 కేలరీల శక్తి, 26 గ్రాముల ప్రోటీన్, 49 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి.
తామర గింజలు (Lotus Seeds)