Do You Leaving Dirty Dishes In Sink Overnight : మెజార్టీ పీపుల్ రాత్రి భోజనం తర్వాత తిన్న గిన్నెలు(Dishes) కడగకుండా సింక్‌లో వదిలేసి, మరుసటి రోజు మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. గిన్నెలను నైట్ మొత్తం సింక్‌లో ఉంచడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
తిన్న గిన్నెలలో ఎంతో కొంత ఆహారం మిగిలిపోతుంది. ఆ గిన్నెలు రాత్రంతా నీటిలో నానుతాయి. దీంతో.. బ్యాక్టీరియా ఎదగడానికి కావాల్సినంత టైమ్ లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. అలా వృద్ధిచెందిన బ్యాక్టీరియా సింక్ లో మాత్రమే ఉండదని.. వంటగదిలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. అంటే.. కిచెన్‌లోని చాకులు, వాటర్ గ్లాసులు, ఇతరత్రా సామాగ్రికి వ్యాప్తి చెందుతాయని అంటున్నారు.
ఉదయాన్నే శుభ్రం చేసినా..
పొద్దున నిద్రలేచిన తర్వాత సింక్‌లో ఉంచిన పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడంతో.. అన్నీ క్లీన్ అయ్యాయని భావిస్తారు. కానీ.. అప్పటికే బ్యాక్టీరియా వంట గదిలోకి విస్తరించి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలియకుండా.. కిచెన్‌లోని వస్తువులన్నీ మామూలుగా వాడేస్తుంటారని, దీనివల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలు మొదలు..
వంట గదిలో వ్యాపించే బ్యాక్టీరియా ద్వారా.. జీర్ణసమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. వీలైనంత వరకూ రాత్రివేళనే పాత్రలన్నీ శుభ్రం చేసి, పడుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు తిన్న గిన్నెలు కడుక్కోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, వంట గదికూడా శుభ్రంగా ఉంటుందని చెబుతున్నారు.