Health Benefits Of Junnu : చాలా మంది ఫేవరెట్ స్వీట్ రెసిపీలలో జున్ను తప్పకుండా ఉంటుంది. ఇందులో పాల కంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రుచిలోనే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా దీనిలో పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయట. అందుకే.. ప్రతిఒక్కరూ జున్ను తినాలని సూచిస్తున్నారు.
కండరాలు బలంగా మారుతాయి : ఇతర పాల ఉత్పత్తుల మాదిరిగానే జున్నులోనూ కండరాలను పటిష్టం చేసే పోషకాలు మెండుగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా దీనిలో పుష్కలంగా ప్రొటీన్లు కండరాలను(Muscles) బలంగా మార్చడానికి చాలా బాగా తోడ్పడతాయని చెబుతున్నారు. కాబట్టి, కండరాల బలహీనత ఉన్నవారు జున్ను తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : జున్ను తినడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు. దీనిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా బాగా ఉపయోగయపడతాయని చెబుతున్నారు. ఫలితంగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు బారినపడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి :ఎముకలు బలంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిల్లో జున్ను ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఇతర పోషకాలు ఎముకలను స్ట్రాంగ్‌గా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు.
2016లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జున్ను తినే వారిలో ఎముకలు విరిగే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని టెక్సాస్ A&M హెల్త్ సైన్సెస్ సెంటర్ డెపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ మార్సియా సి. కాల్డ్‌వెల్ పాల్గొన్నారు. జున్నులో ఉండే కాల్షియం, ఇతర పోషకాలు బోన్స్ బలంగా మారడానికి చాలా బాగా తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.